Kannappa: కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

మంచు విష్ణు తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంతో వస్తున్నాడు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసి కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించడంతో మరింత బజ్ ఏర్పడింది. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోలు నటించడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

అయితే ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో తెలిపారు. కానీ అని వారి కారణాలవల్ల వాయిదా పడింది. అందిన సమాచారం ప్రకారం.. వి ఎఫ్ ఎక్స్ కారణాలవల్లే ఈ మూవీ వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గతంలో మంచు విష్ణు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ఏప్రిల్ 25న రిలీజ్ కావలసిన కన్నప్ప సినిమా వాయిదా పడిందని తెలిపారు. కానీ అప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు శ్రీరాముడి ప్రతిమను గిఫ్ట్ గా అందజేశారు.

అంతేకాకుండా కన్నప్ప రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం యోగి చేతులమీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ను ఆవిష్కరించారు. మొత్తంగా ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చారు. త్వరలో ప్రమోషన్స్ వేగవంతం చేస్తామని అన్నారు.

తరవాత కథనం