‘కన్నప్ప’ టీజర్ రిలీజ్.. అదిరిపోయిన స్టార్ల లుక్స్.. ప్రభాస్ అయితే!

టాలీవుడ్ లో అందరి చూపు ఇప్పుడు కన్నప్ప సినిమా పైనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా భక్తకన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ సహా మరెందరో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ -1 కి భారి స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో బజ్ మరింత క్రియేట్ చేసేందుకు మేకర్స్ మరో అప్డేట్ అందించారు.

తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ 2నీ విడుదల చేశారు. ఈ టీజర్ అధ్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా టీజర్ లో మంచు విష్ణు పవర్ ఫుల్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలు కూడా మెప్పించాయి. ప్రభాస్ లుక్కు కూడా అదరహో అనిపించింది.

మోహన్లాల్, మోహన్ బాబు వంటి సీనియర్ హీరోలు కూడా ఈ టీజర్ లో కనిపించి మరింత అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అధిక వ్యూస్, లైక్స్ తో టీజర్ పరుగులు పెడుతుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.

తరవాత కథనం