Megastar Chiranjeevi : అతను కనిపిస్తే ప్రభంజనం.. స్క్రీన్‌పై కనిపిస్తే.. అరాచకం.. డాన్సులు వేస్తే.. అభిమానుల ఒంట్లో కరెంటు ప్రవాహం.. డైలాగులు చెబుతుంటే ఉప్పొంగే ఆనందం. స్టైల్ చూస్తుంటే రికార్డుల కోలాహలం, ఇలా ఒక్కటేమిటి ఇతను ఏంచేసిన అభిమానులకు పండగే.. ఒక నటుడు బాగా నటిస్తే.. కొంతకాలంపాటు ప్రజలు అతన్ని ఆదరిస్తారు. కానీ వీరిని మాత్రం గుడిలో దేవుడిలాగా తమ గుండెల్లో పెట్టుకుని జనం అభిమానిస్తారు.
ఒక సాధారణ మనిషిగా మొదలై ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించి, ఎన్నో కోట్ల మందిని అలరించి, ఎన్నో వేలమందికి తన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మలచి, కొన్ని తరాలకు వరంలా దొరికిన ఒక వజ్రం ఆయన. అందుకే కళామతల్లి కిరీటంలో కల్కితరాయిగా మారి నేడు తెలుగు నేలకు సొంత అన్నయ్యగా అభిమానుల గుండెల్లో నిలిచారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి.
తాజాగా అగ్రకథానాయుకుడు చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఆయన్ని హౌస్ ఆఫ్ కామన్స్ యూకె పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించనున్నారు. నాలుగున్నర దశాబ్ధాలుగా మూవీస్ ద్వారా కళారంగానికి , సమాజానికి చేసిన ఆదర్శప్రాయమైన సేవలకు గాను ఈ గౌరవ సన్మానం జరగనుంది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందుమిశ్రా అధ్వర్యంలో మార్చి 19న సత్కార వేడుక జరగనుంది. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
అనంతరం అదే వేదికపై చిరంజీవికి జీవిత సాఫల్య పురష్కారం అందించనుంది. మూవీస్, ప్రజాసేవ, ఎక్సలెన్స్ కోసం బ్రిడ్జ్ సంస్థ ఈ అవార్డు అందించనుంది. ఇక చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న సంగతి తెలిసిందే. ముగింపుదశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.