Manch Manoj: మంచువారి ఇంట్లో లడాయి.. కొట్టుకున్న తండ్రి కొడుకులు? పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Image Credit: Twitter

మంచు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి వరకు మాటలకే పరిమితమైన వీరి లడాయి.. ఇప్పుడు కొట్టుకొనేంత వరకు వచ్చిందని సమాచారం. ఇందుకు మంచు మనోజ్‌పై ఉన్న గాయాలే సమాధానం. ఇంతకీ మంచువారి ఇంట్లో ఏం జరుగుతోంది? వారి గొడవలకు కారణం ఏమిటీ? కొట్టుకొనే వరకు పరిస్థితి ఎందుకు చేరింది?

మంచు మోహన్ బాబు మొదటి సంతానం మంచు విష్ణు, మంచు లక్ష్మి. మోహన్ బాబు మొదటి భార్య దివంగత విద్యా దేవికి జన్మించారు. విద్యా దేవి మరణం తర్వాత మోహన్ బాబు నిర్మలా దేవిని పెళ్లాడారు. ఆమెకు పుట్టిన సంతానమే మనోజ్. అయితే, రెండో భార్య బిడ్డ అయినా మంచు విష్ణు, మంచు లక్ష్మి.. అతడిని సొంత తమ్ముడిలాగానే ట్రీట్ చేశారు. ముఖ్యంగా మంచు లక్ష్మికి తన తమ్ముడు మనోజ్ అంటే ప్రాణం. మరి, ఏమైందో ఏమో మెల్ల మెల్లగా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయి. విష్ణు పెళ్లి తర్వాత నుంచే ఈ గొడవలు మొదలైనట్లు సమాచారం.

మనోజ్ విడాకులు.. రెండో పెళ్లి

మంచు మనోజ్ 2015లో తన ప్రియురాలు ప్రణతి రెడ్డిని పెళ్లాడాడు. అయితే కొన్నేళ్లలో వారి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన మనోజ్ చాలా ఏళ్లు సినిమాలకు సైన్ చెయ్యలేదు. కొత్త ప్రాజెక్టులను కూడా తిరస్కరించేవాడు. మనోజో కుమార్ యునిటీ అనే తన ఫౌండేషన్ ద్వారా రైతులుకు సాయం చేస్తున్నాడు. ఆ సమయంలో అతడికి టీడీపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికాతో ప్రేమలో పడ్డాడు. అది మంచు విష్ణు, మోహన్ బాబుకు అస్సలు నచ్చలేదని సమాచారం. ఆమెతో సన్నిహితంగా ఉండొద్దని చాలాసార్లు హెచ్చరించేవారట. ఎందుకంటే.. అప్పటికే విష్ణు, మోహన్ బాబులు వైసీపీ అధినేత జగన్‌కు క్లోజ్. దాని వల్ల పొలిటికల్‌గా కూడా మంచు ఫ్యామిలీపై ఒత్తిడి ఉండేదట. అంతేకాదు.. మౌనికాకు కూడా అప్పటికే పెళ్లయిపోయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమెతో పెళ్లి వద్దని చెప్పడానికి ఇది కూడా కారణం కావచ్చని టాక్. మౌనిక సోదరి అఖిల ప్రియ ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీలో యాక్టీవ్‌గా ఉన్నారు.

ఆస్తుల కోసమా.. పంతాలు పట్టింపులా?

మనోజ్ పెళ్లి తర్వాత విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. శంషాబాద్‌లో మోహన్ బాబు కట్టుకున్న రాజభవనం గురించే గొడవలని కొందరు, ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఇంటి కోసమని మరికొందరు చెబుతుంటారు. అయితే, ఫిల్మ్ నగర్‌లో ఉన్నటి ఇంటిని మోహన్ బాబు.. తన కూతురు మంచు లక్ష్మి ప్రసన్నకు రాసిచ్చారు. ప్రస్తుతం లక్ష్మీ ఆ ఇంట్లో ఉండటం లేదు. తన మకాన్ని ముంబయికి మార్చింది. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్‌గా ఉండటం లేదు. అయితే, లక్ష్మి తన సొంత సోదరుడు విష్ణు కంటే.. మనోజ్‌తోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటుంది. మౌనికాతో పెళ్లి గురించి మోహన్ బాబుకు చెప్పి, ఒప్పించి దగ్గరుండి పెళ్లి చేసింది కూడా ఆమెనే. మనోజ్‌కు బిడ్డ పుట్టిన రోజు కూడా ఆ గుడ్ న్యూస్‌ను ట్వీట్ చేసి చాలా మురిసిపోయింది. దీంతో తప్పు మోహన్ బాబు, విష్ణులోనే ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు.

అలాగే, మోహన్ బాబుకు ఉన్న ఆస్తుల్లో సమాన వాటా మంచు మనోజ్‌కు కూడా రావాలి. ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్‌లో వచ్చే లాభాలను కూడా ఆయనకు ఇవ్వాలనే ఒప్పందం ఉందట. కానీ, అది సక్రమంగా జరగడం లేదని, అది ప్రశ్నించినందుకే మనోజ్‌పై అప్పట్లో మంచు విష్ణు దాడికి దిగారని సమాచారం. అయితే, అలాంటిది ఏమీ లేదని అది తన ఫ్యామిలీ గురించి చేస్తున్న ఓ డాక్యుమెంటరీ తాలుకా పబ్లిసిటీ వీడియో అని, కావాలనే అది లీక్ చేశామంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు మంచు విష్ణు. కానీ, అది వర్కవుట్ కాలేదు. అలాగే మనోజ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణుకు ఇది అస్సలు నచ్చడం లేదని సమాచారం. అతడితో సినిమాలు తీస్తున్న నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

పోలీస్ స్టేషన్‌లో తండ్రి కొడుకులు పరస్పర ఫిర్యాదు

మంచు మనోజ్ ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, మోహన్ బాబే అతడిని కొట్లారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. తాజాగా తెలిసిన సమాచారం ఏమిటంటే.. మోహన్ బాబుకు ముఖ్య అనుచరుడైన వినయ్ అనే వ్యక్తి మనోజ్‌పై దాడి చేశాడట. ప్రస్తుతం అతడు శ్రీ విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నాడట. రౌడీ మూకలతో కలిసి వినయ్ మనోజ్‌ను కొట్టాడని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మనోజ్ ఫిర్యాదు చేశాడు. తన తండ్రి ప్రమేయంతోనే వాళ్లు తనపై దాడి చేసినట్లు మనోజ్ క్లియర్‌గా ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ వివాదానికి శుభం కార్డు పడేది ఎప్పుడో.

తరవాత కథనం