L2 Empuraan telugu Trailer: రప్పా రప్పాలాండించిన కొత్త మూవీ ట్రైలర్.. గూస్‌బంప్స్ వచ్చాయ్!

వచ్చేసింది.. మరో అద్భుతమైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో రిలీజ్ అయింది. మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ నటిస్తున్న కొత్త చిత్రం “L2E: ఎంపురాన్” ట్రైలర్ విడుదలైంది. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ కు ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఇది మూడు పార్ట్లుగా రాబోతుంది.

అందులో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఇప్పుడు రెండో పార్ట్ సిద్ధంగా ఉంది. దీని తర్వాత మూడో పార్ట్ పట్టాలెక్కించునున్నారు. ఇందులో భాగంగానే ఇవ్వాలా విడుదలైన ట్రైలర్ సినీప్రియుల్లో ఫుల్ జోష్ నింపింది.. నా బిడ్డలు కాదు నన్ను ఫాలో అయ్యేది.. నన్ను ఫాలో అయిన వారెవరో వారే నా బిడ్డలు.. అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కట్ చేసిన ట్రైలర్ లో గూస్ బంప్స్ తేపించే సన్నివేశాలు ఉన్నాయి.

పవర్ఫుల్ డైలాగులతో సినీప్రియులో ఉత్సాహం నింపింది. ఇందులో ఫస్ట్ పార్ట్ కు మించిన ట్విస్టులు, రాజకీయ వ్యూహాలు, పన్నాగాలు, దీటైన హీరో ఇజం.. వావ్ అనిపించే సన్నివేశాలు ఉండబోతున్నాయి అని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ విశేషం ఏంటంటే.. తొలిసారిగా ఒక ట్రైలర్ను ఐమాక్స్ వెర్షన్ లో విడుదల చేయడం గమనార్హం. ఇందులో టోవినో థామస్, పృధ్విరాజ్ సుకుమారన్, జెరూమ్ ఫిన్, ఆండ్రియా తివాధర్, సాయికుమార్, మంజు వారియర్, అభిమన్యు సింగ్, ఫాజిల్, సహా మరెందరో స్టార్ నటీనటులు ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.

మలయాళ సినీ ఇండస్ట్రీలోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఆశీర్వాద్ సినిమాస్ అండ్ శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు వర్షన్ లో దిల్ రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది.

తరవాత కథనం