Celebrity Marriages: 2024 లో కొత్త జీవితం ఆరంభించిన 25 మందికి పైగా హీరో హీరోయిన్లు – ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు!

celebrity marriages in 2024

ఈ ఏడాది 25 మందికి పైగా సెలబ్రెటీలకు పెళ్లిళ్లు జరిగాయ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది కూడా నిరాశ తప్పలేదు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రెటీలు వీళ్లే…

నాగచైతన్య-శోభిత

2024 లో ఇంట్రెస్టింగ్ పెళ్లి ఏదంటే…ఫస్ట్ చెప్పే ఆన్సర్ నాగచైతన్య-శోభిత ధూళిపాళ. 2022లో ఓ ఈవెంట్ కోసం ఫస్ట్ టైమ్ కలిశారు. అంతకుముందే ఇన్ స్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కలిసేందుకు ముంబై వెళ్లాడు చైతూ. ఆ తర్వాత రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత పార్కులు, వేడుకలు, షికార్లలో చాలా బిజీ అయిపోయారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో డిసెంబర్ 4న ఒక్కటయ్యారు

రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ

రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ ఆరేళ్ల ప్రేమ తర్వాత 2021 అక్టోబర్ లో తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పారు. 2024 ఫిబ్రవరిలో గోవాలో 3 రోజుల పాటు ఘనంగా వీళ్ల పెళ్లి జరిగింది. మొదట సిక్కు సంప్రదాయంలో, ఆ తర్వాత సింధి సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.

సిద్దార్థ్-అదితిరావు

2024 మోస్ట్ సెలబ్రేటెడ్ పెళ్లిళ్లలో సిద్దార్థ్-అదితిరావుల జంటకీ చోటుంది. రకుల్-జాకీ లా వీళ్లు కూడా రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. ముందుగా సెప్టెంబర్ లో వనపర్తిలోని రంగనాధ స్వామి ఆలయంలో , ఆ తర్వాత నవంబర్ లో రాజస్థాన్ లోని బిషన్ గఢ్ కోటలో మరోసారి పెళ్లి చేసుకున్నారు.

కీర్తి సురేష్ – ఆంటోనీ తటిల్

నాలుగేళ్లపాటు వస్తున్న పుకార్లకు తెరదించుతూ హీరోయిన్ కీర్తిసురేష్ కూడా 2024లో పెళ్లి చేసుకుంది. చిన్నప్పటి ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ ను వివాహమాడింది. రకుల్ ప్రీత్ సింగ్, అదితి రావులా కీర్తిసురేష్ కూడా రెండు సార్లు పెళ్లి చేసుకుంది. గోవాలో హిందూ సంప్రదాయంలో ఓ రోజు, క్రిస్టియన్ సంప్రదాయంలో మరోరోజు పెళ్లి చేసుకుంది.

తాప్సీ – మథియాస్ బో

తాప్సి …బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో ని రెండుసార్లు పెళ్లిచేసుకుంది. 8ఏళ్ల ప్రేమ తర్వాత ఈ ఏడాది మార్చిలో పెళ్లిచేసుకున్నారు. అయితే 2023 డిసెంబర్ లోనే తాప్సి-మథియాస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత బంధువుల కోసం ఉదయ్ పూర్ లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

కిరణ్ అబ్బవరం – రహస్య

హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్యను ఆగష్టులో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కర్నాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది. టాలీవుడ్ కు దూరంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. రాజావారు రాణిగారు సినిమాలో ఇద్దరూ కలసి నటించారు.. వీళ్లిద్దరకీ ఇదే ఫస్ట్ మూవీ.

మేఘా ఆకాష్ -సాయి విష్ణు

హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా 2024లో పెళ్లి చేసుకుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుల వివాహం సెప్టెంబర్ లో చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని వెంటనే హనీమూన్ కోసం యూరోప్ వెళ్లిపోయారు.

ఇంకా ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకున్న వారి జాబితాలో…

బాలీవుడ్ నటి కృతి కర్బందా, పుల్కిత్ సామ్రాట్ ను పెళ్లి చేసుకుంది.
సోనాక్షి సిన్హా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను ముంబయిలో పెళ్లి చేసుకుంది
వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికొలాయి సచ్ దేవ్ ను వివాహం చేసుకుంది
ఆదికేశవ సినిమాతో పేరుతెచ్చుకున్న అపర్ణా దాస్ మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ దీపక పరంబోరల్ ను పెళ్లి చేసుకుంది
మీరా చోప్రా కూడా రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తతో మూడు ముళ్లు వేయించుకుంది
సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్, తన కూతురు ఐశ్వర్య అర్జున్ కు ఈ ఏడాది పెళ్లి చేశాడు

ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించిన లిస్ట్ లో…

డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్న దర్శకుడు క్రిష్ కి ఇది రెండో పెళ్లి
సుబ్బరాజు అమెరికాలో స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు..ఈమె కూడా డాక్టరే
దర్శకుడు సందీప్ రాజ్ హీరోయిన్ చాందినీరావును పెళ్లి చేసుకున్నాడు
నటుడు సాయికిరణ్ , కన్నడ నటుడు-పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న డాలీ ధనుంజయ్, బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు

కొత్త ఏడాదిలో నారా రోహిత్, అఖిల్, తమన్నా, ప్రియా భవానీ శంకర్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎప్పటిలానే హీరో ప్రభాస్ పెళ్లి 2024లో జరుగుతుంది అనుకుంటే ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే మిగిలింది…

తరవాత కథనం