నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోయింది. బన్నీ వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పులుగా వచ్చిన ఈ సినిమా కనీ విని ఎరుగని రీతిలో ఆకట్టుకుంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానులు నీరజనాలు పలికారు. దీంతో నాగచైతన్యకు ఒక మంచి హిట్ దొరికింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోయింది. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.
ఈ కలెక్షన్లతో నాగచైతన్య అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించిన తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య నిలిచాడు. ఇక థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఎప్పుడు ఎప్పుడు ఓ టి టి లో చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
ఈ సినిమా ఎట్టకేలకు ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 7వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ చేయనున్నారు. చూడాలి మరి ఓటిటిలో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.