అక్కినేని నాగ చైతన్య ‘తండేల్’ మూవీతో దెబ్బ అదుర్స్ అనిపించాడు. ఒక్క హిట్టు పడితే చాలు అని అనుకునే నాగచైతన్యకు ఇదొక మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన అతడు ఈ చిత్రంతో ఒడ్డున పడ్డాడనే చెప్పాలి. అక్కినేని నాగార్జున్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఎంతో తాపత్రయ పడ్డాడు.
తన ఫస్ట్ సినిమా నుంచి తనదైన శైలిలో అలరిస్తూ వస్తున్నాడు. మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఇలా ‘తండేల్’ మూవీలో ప్రాణం పెట్టి నటించాడు. దీంతో తనను తాను నిరూపించుకున్నాడు. అందరిచేత ప్రంశసలు అందుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రి నాగార్జున గర్వపడేలా చేశాడు.
తొలి అక్కినేని ఫ్యామిలీలో రూ.100 కోట్లు సాధించిన హీరోగా చైతు నిలిచాడు. అందుకే ఈ మధ్య ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద తండేల్ అదరగొడుతోంది. కలెక్షన్ల పరంగా సైతం రాజులమ్మ జాతరలా సత్తా చాటుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఎలాంటి సినిమా తీస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ అప్డేట్ వచ్చింది. నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో తీయబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ‘వీరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నాగ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు.
వీరూపాక్ష్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథ ప్రకారం భయానకంగా బాగా చూపించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాగచైతన్యతో చేయబోతున్న ఈ సినిమా కూడా వీరూపాక్ష మూవీలాగానే సస్పెన్స్ థ్రిల్లర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నాగచైతన్య ను ఒక కొత్త జోనర్ లో దర్శకుడు కార్తీక్ వర్మ చూపించబోతున్నాడట. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది.