నందమూరి కళ్యాణ్ రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. బింబిసారా మూవీతో కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత డెవిల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ.. కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే గత ఏడాది కళ్యాణ్ రామ్ ఒక్క సినిమా కూడా చేయలేదు.
కానీ ఈ ఏడాది మాత్రం తన కెరీర్లో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా రాబోతుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. అశోక్ క్రియేషన్స్ అండ్ అశోకవర్ధన్ ముప్ప, సునీల్ బలుసు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇందులో కళ్యాణ్ రామ్ ను మునుపేన్నడుచూడని మాస్ లుక్ లో చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అండ్ చిన్న టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ మూవీ నుంచి తదుపరి అప్డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కొన్ని టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మొదటగా ఈ సినిమాకి మెరుపు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రుద్ర అనే మరో టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ రెండు టైటిల్ను కాకుండా మేకర్స్ మరో కొత్త టైటిల్ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ చిత్రానికి “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అనే కొత్త టైటిలను ఫిక్స్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ టైటిల్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో సీనియర్ నటి విజయశాంతి పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రలో నటించబోతుంది. అందువల్ల స్టోరీ కి అనుగొనoగానే మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశలు చేరుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజనీస్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. సోహెల్ ఖాన్, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడికానున్నాయి.