యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. దర్శకుడు కొరటాల శివ ఈ మూవీలో ఎన్టీఆర్ కు కావలసిన ఎలివేషన్స్ అందించి అదరగొట్టేసాడు. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ అదిరిపోయింది. సముద్ర తీరంలో విలన్లను వేటాడే ఎన్టీఆర్ ఊర మాస్ లుక్కుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
వసూళ్లు వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఇతర దేశంలో కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. జపాన్లో ఎన్టీఆర్‌కు మాస్ క్రేజ్ ఉంది. దాని కారణంగానే ఇప్పుడు దేవర మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రం మార్చి 27న జపాన్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ వేయగా అక్కడ ధూంధాం రెస్పాన్స్ వస్తోంది.
జపాన్ క్రేజ్ చూస్తుంటే అక్కడ కూడా ఎన్టీఆర్ దేవర కలెక్షన్ల సునామి సృష్టించనునట్లు తెలుస్తోంది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టనున్నట్లు అర్థమవుతుంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ రేంజ్ వేరు అంటూ తెగ మురిసిపోతున్నారు. కాగా ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ కాగా.. మరొకరు అనిరుద్ అని చెప్పాలి.
ఈ చిత్రానికి అతడు అందించిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించాయి. సాంగ్స్ దుమ్ము లేపేసాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే పార్ట్ 2 పనులు మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.