మరోసారి అల్లు అర్జున్‌కు ఇచ్చిపడేసిన పవన్ – మెగా వారసుడు రామ్‌చరణ్ అంటూ కామెంట్స్

image credit:X

Pawan Kalyan: రాజమండ్రి వేదికగా జరిగిన “గేమ్‌ ఛేంజర్” ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూసీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలని మూలాలు మర్చిపోకూడదని అని అన్నారు. పరోక్షంగా నటుడు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని చర్చ నడుస్తోంది. అంతే కాకుండా రామ్‌చరణ్‌ విధేయతను పదే పదే గుర్తు చేసిన పవన్ కల్యాణ్… మెగాస్టార్‌ వారసుడు ఆయనేనంటూ సర్టిఫికేట్ ఇచ్చారు.

చాలా కాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి మెల్లగా బయటకు వచ్చేసిన అల్లు అర్జున్ తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ పదే పదే ప్రస్తావన తీసుకొచ్చాడు. అసలు మెగా ఫ్యామిలీతో సంబంధం తనకు లేదన్నట్టు బిహేవ్ చేశాడని ఓ విమర్శ ఆయనపై ఉంది. అంతే కాకుండా పుష్ప 1 హిట్‌తో ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని అంటారు.

ఇలా వివిధ సందర్భాల్లో అల్లు అర్జున్ చూపించిన హావభావాలు, ఎక్కాడ మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకురాకపోవడంతో విభేదాలు మరింత పెరిగాయన్న చర్చ నడిచింది. ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రచారం చేయడం మరింత కాక రేపింది. ఇక అల్లు అర్జున్ పూర్తిగా తన సొంత ఇమేజ్‌ కోసం అందర్నీ పక్కన పెట్టేశారనే విమర్శలు గట్టిగానే వచ్చాయి.

మొన్నీ మధ్య పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఒక్క మెగా ఫ్యామిలీ కూడా ఆయనకు మద్దతుగా ఎలాంటి ప్రకటన కానీ చేయలేదు. ప్రీ రిలీజ్ రోజున సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం ఓ బాలుడు ఆసుపత్రి పాలవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్‌పై కేసు నమోదై అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా నడుస్తోంది. ఆ టైంలో కూడా చిరంజీవి నాగబాబు మినహా ఏ మెగా ఫ్యామిలీ మెంబర్ కూడా అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలవలేదు. జైలు నుంచి రిలైజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని వెళ్లి కలిశాడు. అయినా మెగా ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఆయన్ని దగ్గరు చేరదీసినట్టు కనిపించడం లేదు.

మెగా మేనల్లుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ పూర్తిగా చిరంజీవి లాంటి మెగా మామయ్యను పక్కన పెట్టేయడం ఫ్యాన్స్‌కే కాదు మెగా ఫ్యామిలీకే కోపం తెప్పించింది. ఈ విషయం చాలా సందర్భాల్లో కూడా బయటపడింది. ఇదే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్‌ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటూ చురకలు అంటించారు. రామ్‌చరణ్‌ అలాంటి లక్షణాలు ఉన్నాయని రామ్‌చరణ్‌ ఒక్కటే కాదని తామంతా మెగా స్టార్ చిరంజీవి నీడలో ఎదిగిన వాళ్లమే అన్నారు. తాము ఏ పొజిషన్‌లో ఉన్నా సరే అది చిరంజీవి చలవే అన్నారు. అది ఎవరు మర్చిపోకూడాదని అన్నారు.

రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి, ఎంత బలవంతుడైనా ఒదిగే వ్యక్తి అయిన ఆంజనేయుడి పేరుకు సింబల్‌గా రామ్‌చరణ్ అని పెట్టామన్నారు. చిరంజీవి తనకు వరుసకు అన్న అయినా తాను మాత్రం తండ్రి స్థానంలో చూసుకుంటానని అన్నారు. తన వదినను తల్లిగా భావిస్తానని అన్నారు. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చూసిన తర్వాత కచ్చితంగా ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని భావించాను అన్నారు. కానీ రాలేదని కచ్చితంగా భవిష్యత్‌లో ఉత్తమ నటుడి అవార్డు అందుకునే కెపాసిటీ రామ్‌చరణ్‌కు ఉందన్నారు.

ఇలా ప్రతి డైలాగ్‌లో కూడా పరోక్షంగా అల్లు అర్జున్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ రామ్‌చరణ్‌ బెటర్ అన్నట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు గతంలో పుష్ప 1పై విమర్శలు చేస్తూ స్మగ్లర్లను హీరోలుగా చేయడమేంటని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న రామ్‌చరణ్ కారణంగానే సంధ్య థియేటర్ వివాదం ఈ స్థాయికి వచ్చిందని విమర్శలు చేశారు. అనవసరంగా రెచ్చగొట్టారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పరోక్షంగా అల్లు అర్జున్ చేసిన తప్పులను గుర్తు చేస్తూ కామెంట్స్ చేశారు.

తరవాత కథనం