Hari Hara Veera Mallu: ప్రస్తుత రోజుల్లో హీరోలు నటించిన మూవీస్ వరుసగా వాయిదాలు పడటం కామన్. అది ప్రేక్షకులకు కూడా అలవాటు అయిపోయింది. ఒక స్టార్ హీరో సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందని డేట్ అనౌన్స్ చేసినా.. అది ఆరోజు విడుదల అవ్వడం కష్టమే అని ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో కూడా అదే జరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో సుధీర్ఘ ప్రాజెక్టుగా హరి హర వీరమల్లు నిలిచిపోతుంది. ఈ సినిమా షూటింగ్ మొదలపెట్టి నాలుగు, ఐదేళ్లు అవుతుంది. అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. మధ్యలో పవన్ మిగతా సినిమాలకు కమిట్ అవడం.. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అవడంతో రోజు రోజుకి వెనక్కి వెళుతూనే ఉంది వీరమల్లు. మార్చి 28న ఈ సినిమాను రీలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్.. ఇక్కడి నుంచి చూసుకుంటే.. రిలీజ్‌కు నాలుగు వారాలు సమయం కూడా లేదు.
కానీ ఖచ్చితంగా అనుకున్న డేట్‌కు రిలీజ్ చేస్తామని నిర్మాత ఎం ఎం రత్నం పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పవన్ నాలుగు, ఐదు రోజులు సమయం ఇస్తే.. హరిహర వీరమల్లుకు గుమ్మడి కాయ కొట్టాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. కానీ ఈ సమయంలో పవన్ డేట్స్ ఇచ్చి బాలెన్స్ షూటింగ్ ఫినిష్ చేస్తారా ఇనే సందేహాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది.
ఎందుకంటే.. అదే రోజు రాబిన్ హుడ్, మ్యాక్స్ స్క్వేర్ వంటి సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకుని పెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాల ప్రొమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. వీరమల్లుకు వాయిదా అని తెలిసిన తర్వాత ఈ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయినా కూడా వీరమల్లు టీమ్ నుంచి క్లారిటీ రాలేదు. ఇక ఇటీవల కొళ్ళగొట్టినాదిరో సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.