pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో సాంగ్ రెడీ.. డేట్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో దూసుకుపోతూనే.. మరోవైపు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రం ఆపలేదు. ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు చిత్రం ఒకటి.

ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడంతో మరింత హైప్ నెలకొంది.

అయితే ఈ చిత్రం పట్టాలెక్కి ఎన్నో ఏళ్ళు అయింది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేదు. అయినా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా మొదట సమ్మర్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. సినిమా రిలీజ్ ను మేకర్స్ ఇటీవల వెల్లడించారు.

ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే వరుస అప్డేట్స్ అందిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. అవి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఇందులోని మూడో సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాలోని మూడవ సాంగును విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం. అలాగే నాలుగో సాంగ్ ను ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ రెండు సాంగులలో ఒకటి ఫుల్ మాస్.. మరొకటి క్లాస్ అని సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

తరవాత కథనం