pawan kalyan og: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

ఓజి ఓజి ఓజి.. ఇప్పుడు అంతా ఇదే రచ్చ. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమా పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇందులో భాగంగానే గతంలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ తో సినిమా రేంజ్ మారిపోయింది. ఆ ఒక్కటి తప్పించి ఇప్పటివరకు మరో అప్డేట్ లేదు. ఇక అభిమానులు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మూవీ యూనిట్.. వాటిని దాట వేస్తూ వస్తుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ తాజాగా డైరెక్టర్ అండ్ నిర్మాతకు సూచించినట్లు సమాచారం. అందువల్ల అన్ని పనులు పూర్తి చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

దీంతో డైరెక్టర్ సుజిత్ పెండింగ్లో ఉన్న పనులు క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. మే నెలలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేసిన తర్వాత.. ఓజి చిత్రానికి సంబంధించిన అప్డేట్లు వరుసగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ అండ్ జనసైనికులు సరికొత్త జోష్ నింపింది.

తరవాత కథనం