Pawan Kalyan Movies Update: పూర్తిస్థాయి పొలిటికల్ లీడర్ గా దూసుకెళుతున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పొలిటికల్ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది..ఈ విషయం వరకూ ఫ్యాన్స్ హ్యాపీ.. మరి సినిమాల సంగతేంటన్నదే ఇప్పుడు ఆలోచన. మళ్లీ ఎప్పుడెప్పుడు మెకప్ వేసుకుని రంగంలోకి దిగుతారా అని అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు సినిమాలు చకచకా పూర్తికావాల్సి ఉంది..
ఓజీ అంటే క్రేజ్
హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాల్లో పవర్ స్టార్ కి, ఫ్యాన్స్ దృష్టి కూడా ఎక్కువగా ఓజీపైనే ఉంది. సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజీ చాలా బావుంటుంది చూడండి అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు పవన్. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్ కూడా అదిరిపోయింది. అందుకే ఓజీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ మూవీలో పవర్ స్టార్ యాక్షన్ నెక్ట్స్ లెవెల్ అంటున్నారంతా. అందుకే ఈ సినిమా ముందుగా రిలీజ్ చేస్తే బావుంటుందన్నది అందరి అభిప్రాయం.
బ్యాంకాక్ లో షెడ్యూల్
ప్రస్తుతం ఓజీకి సంబంధించి వచ్చిన అప్ డేట్ ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ బ్యాంకాక్ లో మొదలుకాబోతోంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రియల్ హీట్ ఇన్ బ్యాంకాక్ అంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. బ్యాంకాక్ లో జరిగే షెడ్యూల్ లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతోందట. నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఈ సీన్ షూట్ చేయబోతున్నారు. పవర్ స్టార్ రంగంలోకి దిగడమే ఆలస్యం.. లాంగ్ షెడ్యూల్ లో మూవీకి గుమ్మడికాయ కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్..
మార్చిలో హరిహరవీరమల్లు
రాజకీయాల హడావుడి నుంచి చిన్న బ్రేక్ ఇచ్చి ‘హరిహరవీరమల్లు’ సెట్‌లో అడుగుపెడుతున్నానంటూ అనౌన్స్ చేశారు పవన్. హరిహర వీరమల్లుతో పాటూ ఓజీ కూడా చివరి షెడ్యూల్‌లోనే ఉంది. అందుకే ముందుగా ‘హరిహర వీరమల్లు’ను పూర్తిచేసి OG సెట్ లో అడుగుపెట్టనున్నారు. ఈ మూవీ కోసం 2025 మార్చి 28న సిద్ధంగా ఉండండి అంటూ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపారు హరిహరవీరమల్లు టీమ్. దీంతో మరన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.
2025 సమ్మర్లోనే OG
మరోవైపు ఓజీ షూటింగ్ కూడా చివర్లో ఉండడంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే చాలు.. ఓజీని కూడా సమ్మర్లోనే తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సాహోలో యాక్షన్ సీన్స్ కి సుజిక్ స్పెషల్ కాంప్లిమెంట్స్ వచ్చాయ్. ఈ సారి ఓజీలో అంతకుమించి యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయబోతున్నాడట. మరోవైపు హరి హర వీరమల్లు కన్నా ఓజీ కోసమే ఎదురుచూస్తున్న ప్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి హరిహరవీరమల్లు, ఓజీ ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తిచేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్…
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!