Fauji Movie: ప్రభాస్ ప్రియురాలిగా సాయి పల్లవి.. దానికి ఒప్పుకుంటే రచ్చ రచ్చే!

prabhas and sai pallavi new movie

ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాాలో నటిస్తున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లో నటించబోతున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

సీతారామం సినిమాతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు హనూ రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజీ తెరకెక్కించబోతుండటంతో అందిరిలోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో ప్రధాన హీరోయిన్‌గా ఇమాన్వీని మేకర్స్  ఇప్పటికే సెలెక్ట్ చేశారు. అయితేే ఈ సినిమాలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరో హీరోయిన్‌‌ కోసం మేకర్స్ వెతుకులాట మొదలెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలోని పాత్ర కథలో కీలకంగా ఉంటుందని.. అంతేకాకుండా ప్రభాస్ రోల్‌కు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్.

అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్  పాత్రలో హీరోయిన్ కోసం చిత్రబృందం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం సాయిపల్లవిని అప్రోచ్ అయినట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కూడా అదే విధమైన ఎమోషన్స్‌ను చూపించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఫ్లాష్‌బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరును పరిశీలించినట్లు తెలుస్తోంది.

అందులోనూ దర్శకుడు హనూ రాఘవపూడి, సాయి పల్లవి మధ్య ఇదివరకు ‘పడి పడి లేచే మనసు’ మూవీతో పరిచయం ఉంది. కాబట్టి ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి ‘తండేల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బిజీగా ఉండగా.. అక్కడే హను రాఘవపూడి, సాయి పల్లవి భేటీ అయ్యారని సమాచారం. దీనిపై ఆమె ఆసక్తి చూపించిందన కూడా  తెెలుస్తోంది. ఇక అన్నీ కుదిరితే ప్రభాస్ తో సాయి పల్లవి జోడీ కట్టబోతుందనే చెప్పాలి. త్వరలో అఫీషియల్ అప్డేట్ రానుంది.

తరవాత కథనం