ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఎవరు ఊహించిన విధంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ సినీ ప్రియుల్ని, అభిమానుల్ని అలరిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన లైనప్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 మూవీలు చేయనున్నాడు.
ఈ క్రమంలో అతడు మరో సర్ప్రైజ్ అందించాడు. ఈ సినిమాలు లైన్ లో ఉండగానే మరో కొత్త సినిమాకు సంతకం పెట్టేసాడు. హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ప్రశాంత్ వర్మ తను రాసుకున్న కథను ప్రభాస్ కు వినిపించాడని తెలిసింది. ఆ కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.
త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ ను కూడా టెస్ట్ చేశారంట. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం వీడియో రెడీ చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే హనుమాన్ స్టూడియోలో మూడు రోజులు షూట్ చేశారంట. అందులో రెండు రోజులు ప్రభాస్ పై చిత్రీకరించినట్లు తెలిసింది. చూడాలి మరి ఈ సినిమా ఏ జానర్లో రాబోతుందో అనేది.