ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీలు చేస్తున్నాడు. ఈ సినిమాలు తర్వాత మరికొన్ని లైన్లో ఉన్నాయి. అందులో పవర్ ఫుల్ మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు.
ఈ మూవీ ప్రకటించి ఎన్నో నెలలు అయింది. కానీ ఇప్పటివరకు పట్టాలు ఎక్కలేదు. కానీ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. యానిమల్ సినిమాతో ఓ ఊపు ఊపేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయబోతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో తమ అభిమాన హీరో ప్రభాస్ ను పవర్ఫుల్ లుక్ లో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
కాగా చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ గా మారుతుంది. ఇందులో ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రలో కొరియన్ స్టార్ హీరో నటిస్తున్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు మరో వార్త సినీప్రియలో ఉత్సాహం నింపుతుంది.
ఇందులో మరొక టాలీవుడ్ టాలెంటెడ్ హీరో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. అతడే గోపీచంద్. ఈ సినిమాలో ప్రభాస్, గోపీచంద్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరూ ఎలాంటి స్నేహితులో అందరికీ తెలిసిందే. దీంతో గతంలో వర్షం మూవీ తర్వాత ఇప్పుడు మరోసారి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.