రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది కల్కి మూవీ తో వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీ విని ఎరుగని రీతిలో ప్రేక్షకులను అలరించింది. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైన్ అప్ మరింత పెరిగిపోయింది.
దాదాపు నాలుగైదు సినిమాలను వరుసలో పెట్టాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటి తర్వాత మరికొద్ది రోజుల్లో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీలో నటించనున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా సలార్ 2, కల్కి 2 వంటి లైనప్ కూడా ఉంది.
ఇదంతా ఒక ఎత్తైతే.. ప్రభాస్ మరో మూడు కొత్త సినిమాలుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో ఈ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ మూడు సినిమాలకు దర్శకులు ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడు సినిమాలకు దర్శకులు ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది.
అందులో ప్రభాస్-ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో ఒక సినిమా ఓకే అయినట్లు సమాచారం. అలాగే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మరో సినిమా ఫిక్సయిందని తెలుస్తోంది. ఈ సినిమాకి బ్రహ్మ రాక్షస్ అనే పేరు కూడా పరిశీలించినట్లు సమాచారం. ఇక చివరగా హోం భలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న మరో చిత్రం లోకేష్ కనగరాజుతో అని తెలిసింది. ప్రభాస్-లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ మూడు సినిమాలు 2026, 2027, 2028 లో ఒకదాని తర్వాత మరో ఒకటి రిలీజ్ అవుతాయని తెలిసింది. దీంతో రెబల్ స్టార్ అభిమానులు ఫుల్ అవుతున్నారు.