prabhas spirit update: ప్రభాస్ ‘స్పిరిట్’లో ‘యాక్షన్ కింగ్’.. పూనకాలు తెప్పిస్తున్న అప్డేట్!

ప్రభాస్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. దర్శకుడు మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చిత్రం చేస్తున్నాడు. మరోవైపు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమా చేస్తున్నాడు. ఇవే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2, చేయబోతున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ మూవీ పట్టాలెక్కించనున్నాడు.

ఈ స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు మరింత మారుమోగిపోయింది. నార్త్ మొత్తం సందీప్ సినిమాకు అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు అతడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తుండడంతో రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సందీప్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఇందులో పలు భాషలకు చెందిన స్టార్ నటి నటులు భాగం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొరియన్ స్టార్ హీరో ఇందులో ప్రభాస్కు విలన్ గా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా మరో వార్త నెట్టెంటా చక్కర్లు కొడుతోంది.

ఇందులో మలయాళ స్టార్ హీరో కి రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం అందింది. ఇటీవల మార్కో సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న ఉన్ని ముకుందన్.. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీలక పాత్రలో.. అదిరిపోయే యాక్షన్ లుక్ లో దర్శనమిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.

తరవాత కథనం