లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కోలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో తీసిన లవ్ టుడే సినిమా మంచి హిట్ అయింది. కలెక్షన్ సైతం భారీ స్థాయిలో రాబట్టింది. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయాడు.
ఇక ఇప్పుడు డ్రాగన్ అనే మూవీ తీశాడు. మొదట తమిళంలో ఈ సినిమా డ్రాగన్ పేరుతో విడుదలైంది. అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ తో.. కళ్ళు చెదిరే కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.
తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఆదరిస్తున్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిపి తీసిన సినిమా తెలుగులో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఇప్పుడు మరో భాషలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు. ఇప్పుడు హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మార్చి 14న దీనిని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ తరుణంలో ఈ మూవీ ఓటిటీ రిలీజ్ సంబంధించి ఓ న్యూస్ నెట్టెంటా వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ దరకు దక్కించుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.