SSMB 29 Priyanka Chopra: మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా .. వద్దు బాబోయ్ అంటున్న అభిమానులు!

image credit: instargram

SSMB 29 Update: మ‌హేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తోన్న సినిమా వర్కింగ్ టైటిల్ SSMB 29. గ్లోబర్ మూవీకి తెరకెక్కుతోన్న ఈసినిమా కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫైనల్ అయిందట. బాలీవుడ్ తో పాటూ హాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలుగుతోంది ప్రియాంక చోప్రా. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక హాలీవుడ్ లో ఎంట్పీ ఇచ్చిన తర్వాత నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉండిపోయింది. అప్పుడెప్పుడో రామ్ చరణ్ తో జంజీర్ మూవీలో నటించింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. అటు బాలీవుడ్,హాలీవుడ్ లో మాత్రం ఓ వెలుగు వెలుగుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత జక్కన్న పీసి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని టాక్.

భయపెడుతోన్న సెంటిమెంట్
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అమ్మో ప్రియాంక చోప్రా వద్దంటున్నారుట. వాస్తవానికి ప్రియాంక లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయిందంటే మరింత క్రేజ్ పెరిగినట్టే. కానీ..మహేష్ ఫ్యాన్స్ ని మాత్రం ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఇంతకు ముందు మహేష్ మూవీస్ లో బాలీవుడ్ హీరోయిన్స్ నటించినవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయ్…

టక్కరి దొంగ
ఇందులో బిపాసా బసు,లీసారే హీరోయిన్లు గా నటించారు. సాంగ్స్ అదుర్స్ అనిపించాయ్..స్టోరీ కూడా బానే ఉంది కదా అనుకున్నారు.. కానీ ఎక్కడో తేడా కొట్టి టక్కరి దొంగ ఫ్లాప్ అయింది.

వంశీ
తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలసి మహేష్ బాబు నటించిన సినిమా వంశీ. ఈ సినిమా సాంగ్స్ కూడా హిట్టయ్యాయ్ …సినిమా ఫ్లాప్ అయింది.

నాని
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు..అట్టర్ ఫ్లాప్ అంతే. ఇందులో హీరోయిన్ అమీషా పటేల్. అప్పట్లో టాలీవుడ్ మూవీస లో ఫస్ట్ లిప్ లాక్ అంటూ వస్తా నీవెనుక సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. కానీ సినిమా ఓ ప్రయోగంగా మిగిలిపోయింది

అతిథి
అమృతారావు హీరోయిన్ గా నటించిన అతిథి సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చింది కానీ హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది.

వన్
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నించిన వన్ నేనొక్కడినే సినిమాలో కృతి సనన్ హీరో. సుక్కూ దర్శకుడు కాబట్టి బ్లాక్ బస్టర్ అంతే అని ఫిక్సయ్యారు కానీ ఈ మూవీ ఎవరికీ అర్థంకాక పోయింది.

ఇప్పటివరకూ మహేష్ బాబు మూవీస్ లో బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్ కొనసాగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రియాంక చోప్రాని తీసుకోగానే మహేష్ బాబు ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అసలే గుంటూరుకారం ఘాటు నుంచి ఇంకా తేరుకోలేదు..ఇలాంటి టైమ్ లో అవసరమా అంటున్నారు..

ఈ రెండింటి సంగతేంటి?
అన్నీ ఫ్లాప్ అయిపోలేదు..ప్రీతి జింతా నటించిన రాజకుమారుడు, కియారా అద్వాని నటించిన భరత్ అనే నేను హిట్ అయ్యాయి కదా అంటున్నారు మరికొందరు అభిమానులు. పైగా ఇక్కడున్నది అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి..ఆ విషయం మరిచిపోతే ఎట్లా అంటున్నారు.

మొత్తానికి ఎవరి సెంటిమెంట్ ఎలా ఉన్నా జక్కన్న బరిలోకి దిగితే లెక్కలు మారిపోతాయ్ అని తెలుసుకదా. చూద్దాం SSMB 29 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయ్.. 2025 ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుకానుందని టాక్.

తరవాత కథనం