యంగ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘ రాబిన్ హుడ్’ చిత్రం రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర విషయాలు చేశాడు. ముఖ్యంగా రామ్ చరణ్ ‘ఆర్సి 16’ సినిమా గురించి విస్తు పోయే సర్ప్రైజ్ అందించాడు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం 9.09 గంటలకు RC 16 మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనన్నారు. ఈ మేరకు నిర్మాతర శంకర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా అదిరిపోతుంది అని అన్నాడు. ముఖ్యంగా ఈ సినిమా గ్లిమ్స్ రీసెంట్ గా చూసానని.. అది తనకు ఎంతగానో ఆకట్టుకుందని అన్నాడు.
ఈ గ్లిమ్స్ లో స్పెషల్ గా రూపొందించిన ఓ సన్నివేశం కోసమైనా ప్రేక్షకులు కనీసం 1000 సార్లు చూస్తారని అన్నాడు. అంతేకాకుండా తమ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న సినిమాలు గురించి తెలిపాడు. తాము నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు 2026లో విడుదలవుతున్నాయని తెలిపాడు.
అందులో ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్, రామ్‌చరణ్ అండ్ బుచ్చిబాబు, ప్రభాస్ అండ్ హను రాఘవపూడి, రిషబ్‌శెట్టి అండ్ ప్రశాంత్ వర్మ, విజయ్ దేవరకొండ అండ్ రాహుల్ సాంకృత్యన్, పవన్ కల్యాణ్ అండ్ హరీశ్ శంకర్ కాంబినేషన్ చిత్రాలు రానున్నాయన్నారు. అలాగే ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్‌లో రిషబ్‌శెట్టి నవంబరులో పాల్గొంటారని ట్రీట్ అందించాడు.
అందువల్ల 2026 తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. రాబిన్ హుడ్ చిత్రాన్ని ప్రసాద్ ఐమాక్స్లో కూడా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు.