Pushpa 2 The Rule worldwide box office: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూలు చేసి దుమ్ములేపింది. ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులు చెరిపేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. మూడో వారంలోనూ పుష్పగాడి రూల్ ఓ రేంజ్ లో ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఇండియా నుంచి నార్త్ అమెరికా వరకూ పుష్ప 2 కలెక్షన్లు కుమ్మేస్తున్నాయ్.
వాస్తవానికి ‘పుష్ప 2’ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో ఎవ్వరూ ఊహించనంత పెద్ద వివాదంలో చిక్కుకుంది. ముగిసిపోతుంది అనుకున్న వివాదం గాలివానలా మారింది..ఏ తీరానికి చేరుతుందో అర్థంకాని పరిస్థితి. కేసు కోర్టులో ఉంది.. ఈ టైమ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయడం..దానికి కౌంటర్ ఇచ్చేందుకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో రచ్చ మరింత పెరిగింది. ఇదే అదనులుగా ప్రతిపక్షాలు చెలరేగిపోయి మంట చల్లారకుండా ఆజ్యం పోస్తున్నాయ్. బన్నీ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వగానే రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ రోజు తొక్కిసలాట టైమ్ ఏం జరిగిందో మినిట్ టు మినిట్ చూపిస్తూ ప్రత్యక్షంగా అక్కడున్న పోలీసులు ఏం జరిగిందో నేరుగా వివరించారు. అదే సమయంలో అల్లు అర్జున్ తీరు మార్చుకోవాల్సిందే..ఇలా మాట్లాడితే కుదరదంటూ హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బన్నీ బాధ కూడా అదే.. ఇండస్ట్రీలో, తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఆ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నానే..
బయట ఇంత రచ్చ జరుగుతున్నా పుష్ప 2 ప్రభంజనం మాత్రం తగ్గలేదు…వసూళ్లపై ఎలాంటి ప్రభావం లేదు. కొన్ని కొత్త సినిమాలు రిలీజైనా కానీ థర్డ్ వీకెండ్ లోనూ పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు. ఆంధ్ర, నైజాం, యూఎస్, నార్త్ మార్కెట్ లలో దూసుకెళుతోంది మూవీ. ‘పుష్ప 2: ది రూల్’ హిందీలో 16 రోజుల్లో 645 కోట్ల నెట్ వసూలు చేసి…. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో ఆదివారం హిందీలో 25 కోట్లకు పైగా వసులూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బుక్ మై షోలో ఇప్పటివరకు 17.5 మిలియన్లకు పైగా టిక్కెట్ బుకింగ్స్ తో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. న్యూ ఇయర్ తో పాటూ.. సంక్రాంతి సీజన్ వరకూ పుష్ప 2 హవా కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన బాహుబలి 2 హయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సుంది.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు మూవీకి హైలెట్ అయ్యాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈమూవీలో శ్రీలీల కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ చేసింది. ఫహాద్ పాజిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించారు
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!