Flexi Show: డిజిటల్ యుగంలో సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోతోంది. అప్పట్లో థియేటర్లకు మాత్రమే వెళ్లేవారు..ఆ తర్వాత టీవీలు వచ్చాయ్. ఇప్పుడు ఓటీటీల పేరుతో సినిమా రిలీజైన రెండు నెలల్లోగా కొత్త సినిమాలు చూసేస్తున్నారు. ఇక టీవీలతో పనిలేకుండా ఫోన్లలోనే సినిమాలు చూసేస్తున్నారు. దీంతో భారీ భారీ అంచనాలున్న సినిమాలకు మినహా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లాలనే ఆలోచన చేయడం లేదు. పెద్ద సినిమాలకు మినహా మీడియం హీరోలక మూవీస్ కి కూడా బుక్ మై షో, ఆన్ లైన్ పోర్టళ్లలో టికెట్లు తెగడం లేదు.అమెరికా తరహాలో సినిమా పాస్ విధానాన్ని ఇప్పటికే కొన్ని మల్టీప్లెక్సులు అమలు చేస్తున్నాయి. థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెంచేందుకు బల్క్ బుకింగ్స్, ఉచిత టికెట్లతో అట్రాక్ట్ చేస్తున్నాయ్. మున్ముందు ప్రేక్షకుల అవసరాలకు తగ్గట్టు నిర్భంధ సినిమా వీక్షణ కాకుండా, సౌకర్యాన్ని బట్టి సినిమా చూసెళ్లే విధానాన్ని తీసుకొస్తున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది.
డబ్బులు వాపస్ విధానం
FLEXI షో అనే కొత్త విధానాన్ని పరిచయం చేస్తోంది PVR. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు సినిమా నచ్చకపోయినా, ఏదైనా పని ఉండి వెళ్లిపోవాల్సి వచ్చినా, చిన్నారులు ఇబ్బందిపెడితే తిరిగి వెళ్లాల్సి వచ్చినా…మీరు సినిమా చూసిన టైమ్ బేస్ చేసుకుని టికెటింగ్ మోడల్ టైమ్ బేస్డ్ రీఫండ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు.
వాపస్ కి షరతులు వర్తిస్తాయ్
థియేటర్ నుంచి మీరు వెళ్లేప్పటికి సినిమాలో 75 శాతం కంటే ఎక్కువ ఉంటే…టిక్కెట్ ధరలో 60 శాతం తిరిగి పొందుతారు.ఇంటర్వెల్ లో వెళ్లిపోతే 50 శాతం , క్లైమాక్స్ చూడకుండా వెళ్లిపోతే 30శాతం వాపస్ ఇస్తారు. అంటే టికెట్ కొనుక్కుని థియేటర్లో కూర్చున్నంతమాత్రాన మీరు లాక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఏ కారణంవల్ల అయినా వెళ్లిపోతే మీరు నష్టపోరన్నమాట.
ఇప్పటికే అమల్లో ఉంది
ఇప్పటికే ఈ విధానం న్యూ ఢిల్లీ , గుర్గావ్‌లోని 40 సినిమా థియేటర్లలో అమలు చేస్తున్నారు. మున్ముందు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు PVR ప్రయత్నిస్తోంది. ప్రేక్షకుడు సీట్లోంచి వెళ్లేప్పటికి ఎంత సేపు షో చూసిఉంటారో గమనించేందుకు..కెమెరాలు, AI వ్యవస్థ పనిచేస్తుందని టాక్.
ఇది నిజంగా అమలు చేస్తే మంచిదే అంటున్నారు ప్రేక్షకులు..ఎందుకంటే కొన్ని సినిమాలు ఓ అరగంట చూసేసరికి తలనొప్పి మొదలవుతుంది.. టికెట్ డబ్బులు వేస్ట్ అనే ఆలోచనతో బలవంతంగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి విధానంలో అమల్లోకి వచ్చినప్పుడు కాసేపు చూసిన తర్వాత బోర్ కొడితే తిరిగి వచ్చేయవచ్చు..డబ్బులు వాపస్ తెచ్చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం ఎప్పటినుంచో అమలు చేస్తారో చూడాలి…
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!