Rajamouli : ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్.. రాజమౌళి మామూలోడు కాదు భయ్యా!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రాలు దాటని తెలుగు ఇండస్ట్రీ పేరు.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ లోనే వినిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన సినిమాల వల్లే ఇంతటి పేరు, కీర్తి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమను ఓ స్థాయికి తీసుకెళ్లారు. అయితే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టెంటా వైరల్ గా మారింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ తెలిసి సినీ ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం రాజమౌళి శ్రమకు తగ్గ ఫలితం ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ ఆయన రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యూనరేషన్ వివరాలను వెల్లడించింది. అందులో రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్గా రాజమౌళి ఉన్నాడని ఐఎండిబి సంస్థ వెల్లడించింది.

అతడు ఒక్కో సినిమాకు ఎలా లేదన్నా 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని పేర్కొంది. అయితే అది సినిమాలో ప్రాఫిట్ రూపంలో రాజమౌళికి చేరుతుందని తెలిపింది. ఈ స్థాయిలో మరే డైరెక్టర్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని వెల్లడించింది. ఈయన తర్వాత డైరెక్టర్ ప్రశాంత నీల్, సందీప్ రెడ్డి వంగ ఉన్నట్లు తెలిపింది.

వీరు ఒక్కో సినిమాకు 90 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత సుకుమార్, రాజ్ కుమార్ హిరానీ 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఇది వైరల్ కావడంతో రాజమౌళి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి స్థాయికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ఉందని చెబుతున్నారు. ఎందుకంటే రాజమౌళి తీసే ఒక్కో సినిమాకు కొన్ని కోట్లలో బిజినెస్ జరుగుతోందని.. వరల్డ్ వైడ్ గా ఆయన సినిమాలు వేలకోట్ల లాభాలు తెచ్చిపెడుతున్నాయని గుర్తు చేస్తున్నారు.

తరవాత కథనం