Coolie movie: రజినీ ‘కూలీ’ పనులు పూర్తి.. ఇక దబిడి దిబిడే.. వీడియో చూశారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు సమానంగా తనదైన శైలిలో హిట్లు కొడుతూ అదరగొడుతున్నాడు. గతంలో జైలర్ మూవీతో వచ్చి మంచి కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది.

ఇక ఈ మూవీ హిట్టుతో రజనీకాంత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నాడు.

అలాగే కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్సాహీర్, సత్యరాజ్ వంటి నటులు ఇందులో భాగమయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. కూలి మూవీ షూటింగ్ సోమవారంతో కంప్లీట్ అయిందని తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడేప్పుడు చూస్తామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవలే ఈ మూవీ ఓటిటి రైట్స్ డీలింగ్ కుదిరినట్లు తెలిసింది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ 120 కోట్లకు పైగా ధరతో సొంతం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో థియేటర్ రన్ అనంతరం ఈ చిత్రాన్ని నెలరోజుల తర్వాత ఓ టీ టీ లోకి తీసుకురానుంది.

తరవాత కథనం