మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.
దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని రాంచరణ్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబుతో పెద్ది అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఈ మూవీ టైటిల్ను రిలీజ్ చేస్తూ వదిలిన రాంచరణ్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. అప్పటినుంచి ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఎప్పుడు నుంచి ఎదురుచూస్తున్న పెద్ది టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్కులో కనిపించి అదరగొట్టేసాడు.
మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, గుబురు గుబురు గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించి హోరెత్తించాడు. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఒకే పని చేయడానికి.. ఒకేలా బతకడానికి ఇంత పెద్ద బతుకు ఎందుకనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ లో ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. అలాగే రామ్ చరణ్ క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ను నేలకేసి కొట్టిమరీ సిక్స్ కొట్టే సీన్ తో మూవీ రేంజ్ మారిపోయింది.
ఇందులో రామ్ చరణ్ గెటప్, దర్శకుడు బుచ్చిబాబు కాస్ట్యూమ్, విలేజ్ విజువల్ అత్యద్భుతంగా ఉన్నాయి. కేవలం ఈ గ్లింప్స్‌లో రాంచరణ్ ను మాత్రమే చూపించారు. 60 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో రామ్ చరణ్ కనిపించాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.