మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీలాపడింది.
దీంతో ఇప్పుడు పెద్ది సినిమాతో ఒక పెద్ద హిట్ కొట్టాలని రామ్ చరణ్ చూస్తున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఎన్నో ఆసక్తికర హంగులతో రూపొందిస్తున్నాడు. అభిమానుల అంచనాలకందని సన్నివేశాలను ఇందులో పెడుతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
రీసెంట్ గా ఈ మూవీ నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిన్న గ్లిమ్స్ సినిమా రేంజ్ ను మార్చేసింది. ఇందులో రామ్ చరణ్ లుక్కుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఊర మాస్ గా కనిపించిన రామ్ చరణ్ అందర్నీ అట్రాక్ట్ చేశాడు. ముఖ్యంగా ఈ చిన్న గ్లింప్స్ లో రామ్ చరణ్ బ్యాట్ పట్టి నేలకేసి కొట్టిన సీన్ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ గ్లిమ్స్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
ఈ ఫస్ట్ షాట్ విడుదలైన 24 గంటల్లోనే ఊహించని వ్యూస్ను అందుకుంది. ఓకే చానల్లో దాదాపు 36.5 మిలియన్ లకు పైగా వ్యూస్ రాబట్టి ఆలిండియా రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ రికార్డులను ఎన్టీఆర్ పేరున ఉన్నాయి. ఎన్టీఆర్ దేవర గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 26.17 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఇప్పుడు ఆ రికార్డును రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ బద్దలు కొట్టింది. ఏదేమైనా దర్శకుడు బుచ్చిబాబు మాస్ టేకింగ్ అభిమానులకు బాగా నచ్చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.