Renu Desai: రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందోచ్..ఇక పవన్ ఫ్యాన్స్ కి పండుగే!

image credit:Instagram

Renu Desai Pawan Kalyan:  రేణు దేశాయ్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్  ల తనయుడు అకీరా నంద‌న్ ఎంట్రీ గురించి మెగాభిమానులు, జ‌న‌సైనికులు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆరడుగుల బుల్లెట్ లా పవన్ కి తగ్గా తనయుడిలా ఉన్నాడు అకీరా. ఆ హైట్, ఆ లుక్ అదిరిపోయాయ్ అంటూ మురిసిపోతుంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

అకీరా హీరో మెటీరియ‌ల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న జోష్ లో అకీరాతో పాన్ఇండియా మూవీ ప్లాన్ చేస్తే తిరుగులేని హిట్ పక్కా అంటున్నారు అభిమానులు. కానీ అకీరా ఎప్పుడు ఏ మూవీతో ఎంట్రీ ఇస్తాడన్నది ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు.పైగా తల్లి రేణు దేశాయ్ గతంలో అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడంటూ ఓసారి..తన ఇష్టం అంటూ మరోసారి చెప్పడంతో ఓ కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఇప్పుడా విషయంలో క్లారిటీ ఇచ్చేసింది రేణు.

ఇప్ప‌టికే అకీరా వ‌య‌సు 20 ఏళ్లు దాటింది..ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం. ఇలాంటి టైమ్ లో రేణు దేశాయ్ ఓ ఇంటర్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఓ తల్లిగా తాను కూడా అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని వెయిట్ చేస్తున్నా అంది. అయితే ఎప్పుడు హీరోగా వస్తాడన్నది తన చేతిలో లేదు..పూర్తిగా అకీరా ఇష్టంపై ఆధారపడి ఉందని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటి వరకూ అకీరా ఎంట్రీపై ఉన్న సస్పెన్స్ కి తెరపడింది. ఇక రేణూ క్లారిటీ ఇచ్చేసిందంటే..అకీరా ఎంట్రీనే తరువాయి అని మెగా ఫ్యాన్స్ ఫిక్సైపోయారు.

అకీరాకి సంగీతం అంటే చాలా ఆసక్తి అందుకే సినిమాల్లోకి వ‌చ్చినా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు కానీ హీరో ఎలా అవుతాడనేవారు . కానీ ఇప్పుడా సీన్ లేదు..తల్లి కూడా తనయుడు హీరోగానే వస్తాడని చెప్పేయడంతో హమ్మయ్య అనుకుంటున్నారు. ఇక పూర్తి నిర్ణయం అకీరా చేతిలోనే ఉంది.

అకీరా ఎంట్రీకి పూరీ జగన్నాథ్ హ్యాండ్ మంచిదని కొందరు, అనిల్ రావిపూడితో మూవీ అయితే బెటర్ అని మరికొందరు.. హనుమాన్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ వర్మ బెటరని ఇంకొందరు..అప్పుడే డైరెక్టర్ ఎవరనే చర్చలు సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయ్.

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మూవీస్ కి టైమ్ కేటాయించే టైమ్ ఉండడం లేదు. ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న మూడు సినిమాలు పూర్తైతే చాలు అన్నట్టుంది ఫ్యాన్స్ పరిస్థితి. ముఖ్యంగ ఓజీ కోసం క్రేజీగా వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ దృష్టంతా ప్ర‌జా సేవ మీద‌నే ఉంది. 2029 వచ్చేసరికి మరింత బిజీ అయిపోతారు.అప్పటికి పూర్తిగా సినిమాలకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు..ఈ లోగా అకీరా ఎంట్ర జరిగిపోవాలన్నదే మెగా ఫ్యాన్స్ ఆలోచన.

రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అంతా చిరు తనయుడు అన్నారు..ఈ రోజు రామ్ చరణ్ అని మాట్లాడకునే స్థాయికి వచ్చాడంటే ఏ రేంజ్ లో కష్టపడ్డాడో ప్రేక్షకులకు తెలుసు. మరి అకీరా కూడా అలానే సత్తా చాటుకోవాలని ఆశీర్వదిస్తున్నారు. ఇంతకీ అకీరా ఏమంటాడో …ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూద్దాం…

తరవాత కథనం