Samantha Ruth Prabhu: “మీ వయసెంత పర్లేదులే.. ఎవరైన అడిగితే నా తమ్ముడి లంటివాడివని చెబుతాను.” అంటూ క్యూట్ మాటలతో మాయ చేస్తూ.. ఇండస్ట్రీకి సమంత ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఆమె మాయ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అదే స్టార్డమ్ ఎంజాయ్ చేస్తోంది సామ్. తాజాగా మరో మైలు రైయి అందుకుంది ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో 15 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ అరుదైన అవార్డును అందుకుంది సమంత. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తికావడంతో.. హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును అందుకుంది.
ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో సమంతకు అవార్డు అందించారు. ఈ తరుణంలో సామ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తను నటించిన ఫస్ట్ మూవీ ఏమాయ చేశావే సినిమా గురించి కొన్ని ఆశక్తికర విషయాలు పంచుకుంది. 15 సంవత్సరాలు చాలా తక్కువ సమయమే. ఈ సినిమాలో నాకు ప్రతిషాట్ గుర్తుంది. మొదటి సీన్ జీవితాంతం గుర్తుండిపోతుందని తెలిపింది. మొదటి నుంచి నేను నటించిన సినిమాలను ఇప్పుడు చూస్తే.. చాలా చెత్తగా నటించానని అనిపిస్తుంది. అయితే వాటి నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాని తెలిపింది.
ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేసం చేసేవాళ్లు లేకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయానని తెలిపింది. అంతేకాదు.. తనకు తమిళం రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినట్లు సమంత చెప్పింది. ఇన్నేళ్లు తిరిగి చూస్తుంటే.. ఎన్నో ఎత్తు పళ్లాలను చూశానని తెలిపింది. గడిచిన 15 ఏళ్లు తనకు ఓ అనుభవం లాంటిదని తెలిపింది.
ఈ రోజుల్లో హీరోయిన్లు ఐదేళ్లు స్టార్‌గా ఉండటమే కష్టం. అలాంటిది సమంత 15 ఏళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతూనే ఉంది. ఫ్రిబ్రవరి 26 ఆమెకు చాలా ప్రత్యేకం. ఏమాయ చేశావే అంటూ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది సమంత. తొలి సినిమాతోనే అందరిని తన మాయలో పడేసింది. అందులో జెస్సీగా సమంత నటన అద్బుతం అంతే. ఆ తర్వాత బృందావనం, దూకుడు విజయాలతో స్టార్ అయిపోయింది. ఓ వైపు గ్లామరస్ హీరోయిన్‌గా ఉంటూనే.. మధ్యలో ఈగ లాంటి సినిమాతో ఫర్మామెన్స్ చూపించింది సమంత. కెరియర్ మొదట్లోనే వరుస విజయాలతో నెంబర్ వన్ అయిపోయింది. ఈ 15 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో అద్భుతాలు చేసింది సమంత.
నాలుగు ఫిల్మింఫేర్ అవార్డులు, ఆరు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది. ఈ 15 ఏళ్లలో ప్రొఫిషినల్‌గానే కాకుండా పర్శనల్‌గాను చాలా ఇబ్బంది ఎదుర్కుంది సమంత. మొదట సిద్దార్ధతో ప్రేమలో పడి కొన్నేళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడి నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారినపడి పోరాడింది. ఇవన్ని దాటుకుని ఇప్పుడు సౌత్‌తో పాటు.. నార్త్ లోనూ జెండా పాతారు సామ్.