Allu Arjun: సావులు మావి సంపాదన మీది – ‘పుష్ప 2’ షో తొక్కిసలాట ఘటనపై సెటైరికల్ సాంగ్ వైరల్!

image credit:X

 Allu Arjun: టికెట్లు మేమే కొనాలి సావులు మేమే సావాలి..సంపాదన మీదవ్వాలంటూ పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటనపై ఓ సెటైరికల్ సాంగ్ యూ ట్యూబ్ లో వైరల్ అవుతోంది..

మసాలా బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానల్ ఓ సెటైరకల్ వీడియోను విడుదలచేసింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనను అడ్రస్ చేస్తూ ఈ సాంగ్ సాగింది.

సంధ్య థియేటర్ (Sandhya Theatre) పుష్ప 2(Pushpa 2 Show) ప్రిమియర్ షో తొక్కిసలాట ఘటన(Stampede Incident) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడీ ఘటనపై విడుదలైన సెటైరికల్ ఫోక్ సాంగ్ (Satirical Folk Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొక్కిసలాట విషదాం, అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ప్రేక్షకుల అభిమానం, ఫ్యాన్స్ కష్టాలు, స్టార్ హీరో బౌన్సర్ల తీరు, హీరోల వైఖరిని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా సాగింది ఈ పాట.

టికెట్లు మేమే కొనాలి..చప్పట్లు మేమే కొట్టాలి…చావులు మేమే చావాలి..సంపాదన మేదే కావాలన్న లిరిక్స్ బాగా వైరల్ అవుతున్నాయ్. పైసతోనే పాణంగుంటారా మీ పెద్ధమనుషులు..మీ వల్లే సచ్చిన మనిషిని చూడరావు మనసులు అంటూ విమర్శల దాడి చేశారు.

ముందేమో కన్నీళ్లు పెట్టాలి..వెనుకేమో బూతులు తిట్టాలి..పైకేమో ప్రేమలు చూపాలి..లోపల కసురుకోవాలి.. మీరు జైలుకెళ్లినా..భగత్ సింగ్ లా ఫోజులు కొట్టాలి..మీ గేటు ముందు పోటుగాళ్లు క్యూలు కట్టాలంటూ గట్టిగానే చురకలేశారు.

సెల్ఫీలు మేం అడగాలి..చెంపలు మావే పలగాలి..కటౌట్లు మేం కట్టాలి..గెటౌట్లు మాకే దక్కాలి…బౌన్సర్లతో బలుపు చూపి బయటకు నూకాలంటూ జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ.. జర యాదించుకో ఏ సినిమా అయినా మేమే చూడాలంటూ హెచ్చరికగా సాగిందీ పాట

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది..ఈ పాట ప్రభుత్వ వైఖరికి మద్దతుగా బన్నీకి వ్యతిరేకంగా సాగిందన్నది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయం.

పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చిన అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈసమయంలో జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ చనిపోయింది..ఆమె మూడేళ్ల కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదం జరుగుతుందని ఊహించలేదని క్షణాపణలు చెప్పాడు అల్లు అర్జున్. ఈ వ్యవహారంపై అరెస్ట్ అయి ఓ రోజు రాత్రి జైల్లో ఉండి వచ్చిన బన్నీని పరామర్శించేందుకు ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టింది. ఇప్పుడీ మొత్తం విషయంపై ఓ సెటైరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మసాలా బ్యాండ్..

అల్లు అర్జున్ పై సెటైర్స్ వేస్తూ మసాలా బ్యాండ్ రిలీజ్ చేసిన సాంగ్ ఇదే..

ఈ సాంగ్ పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయ్. ఇంటర్నెట్ రీఛార్జ్ మేమే చేసుకోవాలి..ఈ సాంగ్ మేం చేస్తే మీరు డబ్బులు సంపాదించుకోవాలి అని పోస్టులు పెడుతున్నారు మరికొందరు నెటిజన్లు. గతంలో రాజకీయ నాయకుల సభలు , సమావేశల సమయంలో మృతిచెందిన వారి సంగతేంటని క్వశ్చన్ చేస్తున్నారు…ఇదే సమయంలో గోదావరి పుష్కరాల ఘటన, తెలంగాణలో గురుకులంలో పిల్లల మృతి ఘటన గురించి, హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడిన కుటుంబాల పరిస్థితిని ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు.

తరవాత కథనం