Sobhita Dhulipala: పెళ్లయ్యాక గుడ్ న్యూస్ అంటే అదొక్కటేనా..ఎవర్రా మీరంతా!

image credit: instagram

Sobhita Dhulipala Good News:పెళ్లైన వెంటనే గుడ్ న్యూస్ అంటే చాలు…తల్లి కాబోతోందా అని ఠక్కన అడిగేస్తారు. లేటెస్ట్ గా అక్కినేని నాగార్జున కోడలు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాల కూడా గుడ్ న్యూస్ అని పోస్ట్ పెట్టగానే అంతా ఫిక్సైపోయారు. పెళ్లై రెండు నెలలు తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పేసిందంటూ తెగ హడావుడి చేశారు. ఇదంతా హెడ్డింగ్స్ లోనే…అసలు మ్యాటర్ వేరే ఉంది. ఆవిషయం తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు.

అక్కినేని నాగచైతన్య భార్య , హీరోయిన్ శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కినేని వారింటి కోడలు కాకముందు ఆమె గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అస్సలు అవసరం లేదు. అంతలా ట్రెండింగ్ లో ఉంది శోభిత. చైతూతో పెళ్లికి ముందే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. కానీ అక్కినేనివారింటి కోడలైన తర్వాత మరింత పాపులర్ అయింది. అప్పటి నుంచి ఫొటో షూట్స్, కామెంట్స్ , కెరీర్ అప్ డేట్స్..ఇలా ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా ఏం పోస్ట్ పెట్టినా వైరల్ అయిపోతోంది.

లేటెస్ట్ గా శోభిత మీకో గుడ్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టింది. ఇది కలయా నిజమా అని కూడా ట్యాగ్ చేసింది. కొత్తగా పెళ్లైన పిల్ల గుడ్ న్యూస్ అంటే ఇంకేముంది అదే అని ఫిక్సైపోయారు. చైతూ తండ్రి కాబోతున్నాడా.. మన్మధుడు నాగార్జున తాత అవుతున్నాడా..పిల్లలంటే ఇష్టమైన చైతూ కోరిక శోభిత అప్పుడే తీర్చేసిందా… ఇలా బోలెడు కబర్లు. కానీ శోభిత చెప్పాలి అనుకున్న గుడ్ న్యూస్ అదికాదు…

ఆమె హీరోయిన్ గా నటించినది మంకీ మ్యాన్ అనే మూవీ అంతర్జాతీయ అవార్డ్స్ లో నామినేషన్స్ ని సంపాదించుకుంటూ సంచలనం సృష్టించింది. రీసెంట్ గా ఈ సినిమాకు ప్రతిష్టాత్మక బాఫ్తా లో బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ కేటగిరీలో చోటు దక్కింది. రాటెన్ టొమోటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీ గా మొదటి స్థానంలో నిలిచింది. ఇది కలా నిజమా అనే ఆశ్చర్యంలో ఉన్నానంటూ ఆ ఆనందాన్ని గుడ్ న్యూస్ అంటూ షేర్ చేసింది. ది మంకీమ్యాన్ మూవీ 2024 బాఫ్తా యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఎంపికనడం ఎంత ఆనందాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేనంటూ పోస్ట్ పెట్టింది. ఈ గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ గా అర్థం చేసుకున్నారు నెటిజన్లు..

టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా వరుస ప్రాజెక్టులలో నటించింది. అడవి శేషు నటించిన గూడచారిలో కీలక పాత్రలో మెరిసింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తెలుగులో అవకాశాలు వచ్చాయి.. హిందీలో అంతకు మించిన క్రేజ్ వచ్చింది. మజిలి మూవీలో చైతూతో కలసి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సమంత కాకుండా మరో హీరోయిన్ గా ఫస్ట్ శోభితను తీసకున్నారు. కానీ కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందో ఏమో శోబిత సైడైపోయింది. ఇద్దరికీ తొలిపరిచయం అక్కడే అని ఆ తర్వాత ఈ బంధం బాగా బలపడిందని టాక్. సేమ్ టైమ్ సమంత-నాగచైతన్య బంధం బలహీనం అయిందీ ఇక్కడి నుంచే అంటారు నెటిజన్లు.

ఇప్పటివరకూ అయితే నాగచైతన్య శోభిత ధూళిపాల కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా లేదు. ఫ్యూచర్లో కలసి నటిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే శోభిత సినిమాలకు దూరంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయ్. చైతూని పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోంది. అందుకే పెళ్లి తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏవీ చేయడం లేదు. మరోవైపు నాగ చైతన్య మాత్రం తండేల్ సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వరుస డిజాస్టర్స్ అందుకున్న చైతూ..తండేల్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి పెళ్లి తర్వాత నాగచైతన్యకు లక్ కలిసొస్తుందేమో చూడాలి.ఈ గుడ్ న్యూస్ సంగతి సరే..అసలు గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో అని అక్కినేని అభిమానులు వెయిటింగ్…

తరవాత కథనం