South Sequels: బాబోయ్ ఇన్ని సీక్వెల్సా .. 2025 లో ఎన్ని రిలీజవుతాయ్!

image credit:instagram

South Sequels: సీక్వెల్ అంటేనే వణికిపోయేవారు.. సీక్వెల్ తీస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉండేది. కానీ బాహుబలితో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడమే కాదు.. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్ కి కూడా చెక్ పడింది. అప్పటి నుంచి ఇదో ట్రెండ్ అయిపోయింది. అప్పటి వరకూ బాలీవుడ్ కే ఉండే సీక్వెల్ ట్రెండ్ టాలీవుడ్ లో విజృంభించించేసింది.

బాహుబలి, పుష్ప సీక్వెల్స్ వచ్చేశాయ్.. అప్పటివరకూ ఉన్న రికార్డులు తిరగరాశాయ్. పుష్ప 2 రిలీజై 50 రోజులు దాటినా లెక్క తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతోంది.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్-కొరటాల శివ దేవర మూవీ ఆశించిన స్థాయిలో టాక్ సొంతం చేసుకోలేదు కానీ.. అసలు కథ సీక్వెల్ లో ఉండబోతోంది..అందుకే దేవర 2 పై భారీ అంచనాలున్నాయ్

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 AD తిరుగులేని హిట్ అందుకుంది. మహాభారతంలో పాత్రల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

ప్రభాస్ మరో సీక్వెల్ సలార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీలో రెబల్ స్టార్ కి పెద్దగా డైలాగ్స్ లేకపోయినా ఆ కటౌట్ చూసి ఆనందాన్ని నింపేసుకున్నారు అభిమానులు. సెకెండ్ పార్ట్ లో ప్రభాస్ విశ్వరూపం చూపించడం ఖాయం అని ఫిక్సైపోయారు.

ఏ అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్లు కుమ్మేసిన సినిమా హనుమాన్. ఊహించని రేంజ్ లో ఘన విజయం అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తోంది.

అంతెందుకు ఇప్పుడిప్పుడే హడావుడి మొదలైన SSMB 29 కూడా రెండు పార్టులే అని చెప్పేశారు.

ఇక తెలుగులోనే కాదు తమిళంలోనూ అదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే జైలర్ లో సక్సెస్ అందుకున్న రజనీకాంత్ జైలర్ 2 తో రాబోతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఆ మూవీ పనిలో చాలా బిజీగా ఉన్నాడు.

ఇండియన్ సూపర్ హిట్టవడంతో ఇండియన్ 2 తీశాడు శంకర్.. కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఇండియన్ 3 తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కమల్ హాసన్-శంకర్ ఈ ప్రాజెక్టును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ హిట్టైంది కదా..దానికి సీక్వెల్ గా సర్దార్ 2 రాబోతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది ఈ స్పై థ్రిల్ల‌ర్. సేమ్ టైమ్ సక్సెస్ అయిన ఖైదీకి సీక్వెల్ గా ఖైదీ 2 తెరకెక్కించేందుకు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడు.

సూర్య ఫ్రాంచైజీ సింగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింగం ఇప్పటికే మూడు భాగాలుగా వచ్చేసింది. నాలుగో భాగం సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.

కన్నడంలోనూ KGF కి సీక్వెల్ గా KGF2 వచ్చింది .. హిట్ అయింది. KGF 3 రెఢీ అవుతోంది.

ప్రాంతీయ సినిమాగా వచ్చిన కాంతారా సన్షేషనల్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడీ మూవీకి ప్రీక్వెల్ సిద్ధమవుతోంది…

ఇవే కాదు ఇంకా చాలా సీక్వెల్స్ ప్రచారంలో ఉన్నాయ్. ఈ ఏడాది మధ్యలో కానీ ఎండింగ్ కి కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఓవరాల్ గా చూస్తుంటే ఫ్యూచర్లో సీక్వెల్స్ తప్ప సింగిల్ మూవీస్ ఉండవేమో…

తరవాత కథనం