యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లోను ఫుల్ బిజీ అయిపోయింది. దెబ్బలు పడతాయ్ రాజా దెబ్బలు పడతాయిరో అంటూ ఒక ఊపు ఊపేసింది. పుష్ప 2 మూవీలో కిస్ కిస్ కిస్ కిసిక్కి సాంగ్ లో నిజంగానే దెబ్బలు పడేలా చేసింది. దీంతో బీటౌన్ మొత్తం తన వైపే చూసింది. డాన్సింగ్ క్వీన్ గా పేరుందిన శ్రీ లీల ఈ ఒక్క సాంగ్ తో నార్త్ లో అవకాశాలు కొట్టేసింది.
ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. ఇదే సమయంలో యంగ్ బ్యూటీ బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ చట్టపట్టలేసుకుంటూ తిరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సైతం వైరల్ గా మారాయి. మరి ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.
ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఇటీవలే దేవర సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల కు అవకాశం వచ్చినట్లు ముందుగా ప్రచారం జరిగింది.
కానీ ఆమె కార్తీక్ ఆర్యన్ తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భూల్ భూలయ్య 3 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అనురాగ్ బసుతో కార్తీక్ ఆర్యన్ మరో సినిమాకి కమిట్ అయ్యారు. ఈ సినిమాలోనే శ్రీలీల హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని ఈ ఏడాది దివాలికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రమంలోనే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సారా అలీ ఖాన్ తో బ్రేకప్ తర్వాత సింగిల్ గా ఉంటున్న కార్తీక్.. శ్రీలీలతో మింగిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరిన్ని రూమర్లను క్రియేట్ చేసింది.
దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని బటౌన్ లో వార్తలు జోరుగా సాగుతున్నాయి. అదికాక ఇటీవల కార్తీక్ ఆర్యన్ ఫామిలీ పార్టీలో శ్రీలీల మెరిసేసరికి వీటికి మరింత బలం చేకూరింది. అక్కడే వాళ్లతో డాన్సులు చేస్తూ శ్రీలీల సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టెంటా వైరల్ గా మారాయి. మరి ఈ రూమర్లపై శ్రీ లీల స్పందిస్తుందా లేదో చూడాలి.