దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్‌కే కాదు.. యావత్ ఇండియాకు సుపరిచితుడు. ‘బాహుబలి’ మూవీ సీరిస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే, దక్షిణాది దర్శకుడి లభిస్తున్న ఈ క్రేజ్ ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ సినీ ప్రేమికులకు మింగుడు పడటం లేదు. అయితే, ఈ విషయంలో అందరినీ తప్పుబట్టలేం.. జక్కన్నకు నార్త్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. బాలీవుడ్ మూస దోరణి మూవీస్‌కు విసిగిపోయిన నార్త్ జనం.. మన తెలుగు సినిమాలకు అభిమానులుగా మారిపోయారు. అయితే.. ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు జక్కన్నను తెలుగు దర్శకుడిగా చూడలేకపోతున్నారు. అతడు ఇప్పుడు భారతీయ దర్శకుడు. అందుకే, ఆయన పొరపాటున తెలుగువారి గురించి ఏమైనా మాట్లాడితే.. నార్త్ వాళ్లకు ఎక్కడ మండుతోంది. తాజాగా ‘పద్మ’ అవార్డుల నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఉత్తరాది వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
అసలు ఏమైంది?
కేంద్ర ప్రభుత్వం.. 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఏడుగురు తెలుగువారికి పద్మ అవార్డులు లభించాయి. వారిలో టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు. ఏడుగురు తెలుగువారికి పద్మ అవార్డులు లభించడం గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పద్మ అవార్డులందుకున్న అందరికీ అభినందనలు అని చెప్పారు. అజీత్, శేఖర్ కపూర్‌లకు కూడా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆ ట్వీటే ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారింది. నార్త్ ఇండియన్స్ దీన్ని తప్పుబడుతున్నారు. అన్నట్లు.. ఆయన అన్న మాటల్లో తప్పు ఏముందనేగా మీరు అనుకుంటున్నారు?
పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారికి అభినందనలు చెప్పడమే రాజమౌళి చేసిన తప్పు. అసలే సౌత్ మీద మంట మీద ఉన్న బాలీవుడ్ అభిమానులకు ఇది ఒక అవకాశంగా మారింది. ‘‘నువ్వు అస్సలు భారతీయుడివేనా?’’ అంటూ ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. పాన్ ఇండియా దర్శకుడిగా తెలుగువారిని అభినందించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుళ్లునంతా సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు. అయితే, రాజమౌళి అభిమానులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అరే.. పనికి మాలిన డ్యాషుల్లారా.. ఆయన పాన్ ఇండియా దర్శకుడు అవ్వడానికి ముందు ఒక తెలుగువాడురా అంటూ వేసుకుంటున్నారు.
ఈ ప్రభావం మహేష్ మూవీపై పడనుందా?
బాలీవుడ్ సినీ అభిమానులకు మహేష్ బాబు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే.. గతంలో ఆయన కామెంట్సే ఇందుకు కారణం. ‘‘మీరు బాలీవుడ్ మూవీస్ ఎందుకు చెయ్యడం లేదు’’ అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘బాలీవుడ్ నన్ను ఎఫర్ట్ చెయ్యలేదు’’ అని సమాధానం చెప్పారు. అయితే, దాన్ని నార్త్ జనం వేరేగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి.. మహేష్ బాబు టాలీవుడ్‌లో లభించే అంత గౌరవం తనకు బాలీవుడ్‌లో ఉండకపోవచ్చని. అయితే, దాన్ని వేరేగా అర్థం చేసుకున్నవారు.. మహేష్ బాబు పాన్ ఇండియా మూవీతో రావడాన్ని సహించలేకపోతున్నారు. పైగా అది వారు ఎంతగానో అభిమానించే జక్కన్న మూవీ. అందుకే, ఇప్పటి నుంచే నార్త్ జనం ఈ మూవీపై నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. అదే సమయంలో జక్కన్న పద్మ అవార్డులపై చేసిన ట్వీట్.. వారికి అవకాశంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని జక్కన్న-మహేష్ బాబు మూవీని బాయ్ కట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే.. ‘బాయ్‌కట్’ అది వారి బ్రహ్మాస్త్రం.