Gandhi Tatha Chettu Movie: ‘గాంధీ తాత చెట్టు’…ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో ఓ ఆసక్తి నెలకొంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించింది సుకృతి. ఈ చిన్నారి ఎవరో కాదు నేషనల్ అవార్డ్ గెలుచుకున్న దర్శకుడు సుకుమార్ కుమార్తె. గతంలో నాగచైతన్య, తమన్నా నటించిన 100% లవ్ స్టొరీలో హీరోయిన్ ఇంట్రో షాట్ లో మెరిసింది సుకృతి వేణి. ఇఫ్పుడు గాంధీ తాత చెట్టుతో వస్తోంది. ఈ మధ్యే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
మహేష్ సపోర్ట్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియా వేదికగా గాంధీ తాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఈ మూవీపై డిస్కషన్ స్టార్ట్ అయింది. అందరి అటెన్షన్ ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది ఈ మూవీ. గాంధీ సిద్ధాంతాలను అనుసరించే ఓ అమ్మాయి తన గ్రామాన్ని రక్షించేందుకు చేసే ప్రయాణమే కథ. ఇందులో సుకృతి గుండుతో కనిపించింది. ఇది అందరి హృదయాలను హత్తుకునే మూవీ..ఇలాంటి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు మహేష్ బాబు. సుకృతి సహా టీమ్ అందరకీ నా అభినందనలు అని తెలియజేశాడు మహేష్.
గాంధీ సిద్ధాంతాలు ఈ తరానికి తెలియాలి
గాంధీ తాత చెట్టు సినిమా దర్శకురాలు పద్మావతి మల్లాది మహేష్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నెగటివిటీ పెరిగిపోతున్న ఈ సమయంలో గాంధీ సిద్ధాంతాలను ఈ తరం పిల్లలకు తెలియజేయడం చాలా అవసరం అన్నారు. అహింస,శాంతి సిద్ధాంతాలను అనుసరించే ఓ చిన్నారి తన గ్రామంకోసం చేసే ప్రయత్నం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందన్నారు పద్మావతి. రీ అందించిన సంగీతం సినిమాకు స్పెషల్ అవుతుందని..సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ రాసిన పాటలు మెప్పిస్తాయన్నారు.
నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్
రిలీజ్ కు ముందే గాంధీ తాత చెట్టు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ మూవీ ఎన్న అవార్డులు అందుకుంది. ఉత్తమ బాల నటిగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి కూడా అవార్డు అందుకుంది. లెక్కల మాస్టారు సుకుమార్ కూతురంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్‌నేషనల్ అని అంతా ప్రశంసిస్తున్నారు.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!