సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలి మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ తరుణంలో రజినీకాంత్ మరో చిత్రానికి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అతడు గతంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. ఈ సినిమా రజినీకు మంచి కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసింది. కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతుంది. త్వరలోనే జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం అందింది. దర్శకుడు నెల్సన్ జైలర్ 2 పనులను చక చక పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. జైలర్ 2 షూటింగ్ కు రజిని డేట్స్ కేటాయించినట్లు తెలిసింది.
వచ్చే వారం నుంచే చెన్నైలో ఈ షూటింగ్ జరగనున్నట్లు.. తొలి షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్ ని గోవాలో జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ మూవీ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలో కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇందులో నిజం ఎంత ఉందో.