OTT Release Movies: కొత్త సినిమాలు థియేట్రికల్ రన్ పూర్తయితే చాలు.. ఫలానా రోజున ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కొన్ని సినిమాలు ఈరోజు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోనూసూద్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫతేహ్’
సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన ఫతేహ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్చి 7న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. జియో హాట్‌స్టార్ వేదికగా హిందీలో స్ట్రీమింగ్ కానుంది. జాక్వెలెన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది.
అక్షయ్ మూవీ ‘స్కైఫోర్స్’
అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా, అలీఖాన్ నిమ్రత్ కౌర్ కీలక పాత్రలో నచించిన వార్ డ్రామా స్కైఫోర్స్. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లో రిలీజ్ అయి సందడి చేసింది. ఇక తాజాగా మార్చి 7న ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ కథానాయికగా .. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
హాస్యనటుడు వెన్నెల కిషోర్ ప్రధానపాత్రలో .. రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. క్రిస్మస్ కానుకగా విడుదలై వినోదాన్ని పంచింది. తాజాగా మార్చి 7న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘మనమే’ సినిమా
శర్వానంద్‌కు జోడీగా కృతి శెట్టి నటించిన సినిమా మనమే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటికి కామెడీ డ్రామా “మనమే” మూవీ గతేడాది జూన్ 7న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.