Odela 2 Trailer: తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్ చూశారా? అదిరిపోయిందంతే

హెబ్బా పటేల్ అండ్ సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా టైంలో నేరుగా ఓటీడీలోకి వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. ఎవరు ఊహించని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ యాక్టింగ్ అదరగొట్టేసింది.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి హెబ్బా పటేల్ కు బదులు సీక్వెల్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తుంది. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో బాగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇందులో తమన్నా డైలాగ్స్ మోస్ట్ పవర్ఫుల్ గా ఉన్నాయి. నాగ సాధువు.. శివశక్తిగా మారిన తర్వాత ఆ ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపించారు. డైలాగుల తర్వాత వచ్చే యాక్షన్స్ సన్నివేశాలు అదిరిపోయాయి. అయితే మొదటి పార్ట్ చివర్లో వశిష్టను అతని భార్య హెబ్బా పటేల్ హతమారుస్తుంది. ఆమె జైలు పాలు అయిన తర్వాత చనిపోయిన వశిష్ట ఆత్మగా మారి ఊరందరి మీద పగ ప్రతికరాలు తీర్చుకుంటాడు.

అప్పుడే హెబ్బా పటేల్ సోదరిగా తమన్నా శివశక్తి రూపంలో వస్తుంది. అయితే ఆమె ఎప్పుడో శివశక్తిగా మారి ఊరికి దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే తమ ఊర్లో ఆత్మ తిరుగుతుందని తెలుసుకుంటుందో అప్పుడు ఊర్లోకి ఎంటర్ ఇస్తుంది. ఒక విధంగా ఈ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంతా భావిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రం ఈనెల అంటే ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం