Tasty Teja: పంజాగుట్ట పీఎస్‌లో.. విచారణకు హాజరైన టేస్టీ తేజ

Tasty Teja

Tasty Teja: బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్,యూట్యూబర్ టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మార్చి 18న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులు టేస్టీ తేజను విచారిస్తున్నారు. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్, నగదు లావాదేవీల గురించి ఆరదాదీస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే 11 మంది యంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా టేస్టీ తేజ, విష్ణుప్రియను మార్చి 18న విచారణకు హాజరుకావాాలంటూ ఆదేశించారు. అయితే విష్ణు ప్రియ డుమ్మ కొట్టగా.. టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు.

మరో వైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్‌కి చేరినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోన్నారు. దీనిపైకు పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుని బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై ఈడీ విచారిస్తోన్నట్లు తెలిసింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విష్ణు ప్రియ, టేస్టీ తేజకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. మంగళవారం నాడు వీరి ఇద్దరి తరఫున పంజాగుట్ట పోలీసులను కలిశారు శేఖర్ బాషా. విష్ణు ప్రియ, టేస్టీ తేజ విచారణకు రావడానికి.. టైం కావాలని వాళ్ల తరఫున పోలీసులను కోరినట్లు చెప్పారు. విచారణకు పోలీసులు మూడ్రోజులు సమయం ఇచ్చారన్నారు. బెట్టింగ్ యాప్స్ పర్యావసనాలు తెలీకుండా వాళ్లు ప్రమోషన్స్ చేశారన్నారు. ఇక నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీలో ఎవరూ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్ చేయరన్నారు శేఖర్ బాషా. కాగా టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే.. రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలనే ఆశతో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. బెట్టింగ్ కాస్తున్న యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనంగా మారడంతో అప్పుల్లో కూరుకుపోయి అఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్‌లో లాభాలు కంటే నష్టపోయినవాళ్లే వేలాదిగా ఉన్నారు. చాలామంది యువకులకు ఇదొక వ్యసనంగా మారడంతో లక్షలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ కోసం లోన్ యాప్ నుంచి, తెలిసినవారి నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి అప్పులు చేయడం.. చివరికి అవి తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడం చాలాచోట్ల జరుగుతోంది. ఆస్తులేవి లేని యువకులు డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి.

బెట్టింగులతో మంది జనం చనిపోతున్నా.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా చెప్పుకుని తిరుగుతున్న వారి కంటికి కనిపించడం లేదు. పైసల కోసం దిగజారుతూనే ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగులుతోంది. చేసిన అప్పులు కట్టలేక కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బులతో పాటు ప్రాణాలు తీసుకుంటుడంతో కుటుంబాల్లో కన్నీళ్లే మిగులుతున్నాయి.

తరవాత కథనం