Rashmika The Girl Friend: రష్మిక మందన్న బర్త్ డే స్పెషల్ ట్రీట్ అదిరింది మచ్చా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా దూసుకుపోతుంది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.

ఇప్పుడు వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మరోవైపు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించి అదరగొడుతోంది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే ఆమె చేస్తున్న కొత్త చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”. నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఇది.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ అండ్ మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ధీరథ మొగిలినేని, విద్య కుప్పినీడి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమ కథతో విచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇవాళ నేషనల్ క్రష్ రష్మిక బర్తడే. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సర్ప్రైజ్ అందించారు. ఈ సినిమా నుంచి టీజర్ సాంగ్ “రేయి లోలోతుల” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ అద్భుతంగా స్వరపరచగా రాకేందు మౌళి ఆకర్షణ ఏమైనా సాహిత్యం అందించారు. అలాగే విజయ్ దేవరకొండ, హేషం అబ్దుల్ వహాబ్, చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం ఇది అందర్నీ అలరిస్తోంది.

తరవాత కథనం