this week ott movies: ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్, సస్పెన్స్ మూవీస్.. చూడాల్సిన బెస్ట్‌వి ఇవేే!

OTT Weekend Watch: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఆహా, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్ లలో ఇవాళ ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ రిలీజ్ కానున్నాయి. అందులో 2 మలయాళం చిత్రాలు, 2 తెలుగు సిరీస్‌లు ఆసక్తి రేపుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

హోమ్ టౌన్ సిరీస్ – ఆహా

గతంలో ఓటీటీలోకి వచ్చిన #90’s వెబ్ సిరీస్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో సిరీస్‌ తెలుగులోకి వచ్చేస్తోంది. ఆ సిరీస్ పేరు హోమ్ టౌన్. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. శుక్రవారం అంటే ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది.

టచ్ మి నాట్ – జియోహాట్‌స్టార్

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్‌లో వస్తోన్న మరో థ్రిల్లింగ్ సిరీస్ ‘టచ్ మి నాట్’. టాలీవుడ్ సీనియర్ నటుడు నవదీప్, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి కలిసి నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో శుక్రవారం అంటే ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఉద్వేగం – ఈటీవీ విన్

గత ఏడాది విడుదలైన తెలుగు చిత్రం ఉద్వేగం.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో గురువారం అంటే నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అలరించిన ఈ క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో వీక్షించొచ్చు.

టెస్ట్ – నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి రాబోతున్న మరో సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం ‘టెస్ట్’. ఇందులో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటించారు. ఈ తమిళ మూవీ ఏప్రిల్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

ఒరు జాతి జాతకం, మాచంటే మాలఖ – మనోరమ మ్యాక్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ మనోరమ మ్యాక్స్‌లో ఈవారం రెండు కొత్త మలయాళం చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఇప్పటికే ‘ఒరు జాతి జాతకం’ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరో చిత్రం.. మాచంటే మాలఖ. ఈ చిత్రం ఏప్రిల్ 4న స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు చిత్రాలూ ఫుల్ కామెడీ ఎంటర్ట్రైనర్‌ సినిమాలే.

 

తరవాత కథనం