NTR ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. దేవర2, డ్రాగన్ మూవీ అప్డేట్స్ అదుర్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా ప్రకటిoచినప్పటి నుంచి భారీ అంచనాలను అందుకుంటూ వచ్చింది. ఇక థియేటర్లలో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరికి మాత్రం ఈ సినిమా ఎక్కలేదని చెప్పాలి. అయినా ఈ చిత్రానికి కలెక్షన్స్ భారీ స్తాయిలో వచ్చినట్లు తెలిసిందే.

ఇందులో సాంగ్స్, ఎన్టీఆర్ మాస్ లుక్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. దీంతో సెకండ్ పార్ట్ గురించి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ పై సినీప్రియలో భారీ అంచనాలు ఉన్నాయి. అందువల్ల వారి అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు కొరటాల శివ కథను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక సెకండ్ పార్ట్ అప్డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివను కలిశాడని.. అక్కడే అతడు చెప్పిన స్టోరీ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. దీంతో ఈ ఏడాది జూలై నుంచి సెట్స్ పైకి వెళ్దామని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం.

మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా ఎన్టీఆర్ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం రేపటి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ ఓవైపు దర్శకుడు కొరటాల శివతో అలాగే ప్రశాంత్ నీల్ తో బిజీ బిజీగా ఉండనున్నాడు. ఈ అప్డేట్స్ తో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

తరవాత కథనం