విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట రచ్చ లేపిన సంగతి తెలిసిందే. వైసిపిని ఉద్దేశించి అతడు చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. గతంలో 150 మేకలు ఉండేవని కానీ ఆ తర్వాత చూస్తే 11 మేకలే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది.
దీంతో రంగంలో దిగిన వైసీపీ సోషల్ మీడియా పృథ్వి రాజును టార్గెట్గా పెట్టుకుంది. పలు వీడియోలు ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా #boycott Laila అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసింది. దీనిపై లైలా మూవీ యూనిట్ కూడా స్పందించింది. పృధ్విరాజ్ చేసిన వ్యాఖ్యలపై లైలా మూవీ యూనిట్ క్షమాపణ చెప్పింది. అనంతరం పృద్వి క్షమాపణ చెప్పాలని వైసీపీ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.
కానీ పృధ్విరాజ్ మాత్రం అప్పుడు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ అభిమానులు మరింత రెచ్చిపోయారు. వారి టార్చర్ తట్టుకోలేక పృధ్వీరాజ్ హాస్పిటల్ లో చేరాడు. అక్కడి నుంచి బయటికి వచ్చాక మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆపై పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్లు, మెసేజ్ లతో తనను టార్చర్ చేస్తున్నారని.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
మరి ఏమైందో ఏమో కానీ తాజాగా పృద్వి వెనక తగ్గాడు. ఈ మేరకు వైసిపి అభిమానులకు క్షమాపణ చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదని అన్నాడు. తనవల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ సారీ చెప్తున్నాను అని అన్నారు. ఇకనుంచి బాయికాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనాలి అంటూ కోరాడు. లైలా మూవీ ఫలక్నుమా దాస్ కంటే పెద్ద హిట్ కావాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడైనా వైసీపీ అభిమానులు చల్లబడతారా లేదా అనేది చూడాలి.