ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అందరికీ ఇష్టమే. పుష్ప2 సినిమాతో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. కనివిని ఎరుగనినంత స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ గౌరవం కేవలం పుష్ప సినిమాతోనే వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచాడు.
ఇక అతడు చేసిన పుష్ప 2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ ను సైతం ఫేక్ చేసింది. మరి అలాంటి హీరోకి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ సెలబ్రిటీలు సైతం అతడి యాక్టింగ్ కు ఫిదా అయినవారు ఉన్నారు.
అతడితో నటించేందుకు ఎంతోమంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ సరసన ఒక్కసారి అయినా నటిస్తే జన్మదిన అయిపోతుంది అని హీరోయిన్ల మనసులో ఉంది. ఇప్పటికి చాలామంది అదే విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
అందులో ఓ హీరోయిన్ కూడా బన్నీతో ఒక్కసారి అయినా లైఫ్ లో నటించాలి అని అనుకున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ హీరోయిన్.. అల్లు అర్జున్ అంటే తనకు చాలా పిచ్చని తెలిపింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియ భవాని శంకర్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అల్లు అర్జున్ అంటే తనకు పిచ్చి అని తెలిపింది.
అతనితో ఒక్కసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని పేర్కొంది. రొమాంటిక్ సీన్ లలో అయినా పర్వాలేదు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు నెట్టెంటా వైరల్ గా మారాయి. అయితే ఈ నటి గతంలో కళ్యాణం కమనీయం అనే సినిమా సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి అవి వైరల్ గా మారాయి