టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈమె అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి ఫుల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్ డం అందుకుంది. తనకంటూ స్పెషల్ స్టేటస్ ఏర్పాటు చేసుకుంది.
ఇక ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగచైతన్యతో లవ్ లో పడింది. ఇలా ఇద్దరు ప్రేమలో మునుగితేలిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు. కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. అక్కడి నుంచి సమంత ఎన్నో సమస్యలు, ఇబ్బందుల్ని ఎదుర్కొంది. వరుసగా ఒకదాని తర్వాత మరొకటి సమంతను చాలా ఇబ్బంది పెట్టాయి.
అనారోగ్య సమస్యలతో ఎక్కువ రోజులు బాధపడింది. దీంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె కోరుకుంటుంది. పలు సినిమాల్లో నటిస్తూ మళ్లీ బిజీ అయిపోతుంది. బాలీవుడ్లో కూడా ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవలే సీటడేల్ అనే సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. ఇలా పలు సినిమాలతో ఇప్పుడు బిజీ బిజీ అయిపోయింది.
అయితే తాజాగా ఈ అమ్మడు తన మాజీ భర్త నాగచైతన్య రెండో పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు నాగచైతన్య రెండో పెళ్లిపై ఓ వార్త ఎదురైంది. దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరు అసూయగా ఫీల్ అవుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన సమంత తన జీవితంలో అసూయకు తావు లేదు అని తెలిపింది. తన జీవితంలో అసూయ అనేది భాగం కావాలని కూడా అంగీకరించని తెలిపింది. అసూయ అన్ని చెడులకు మూలమని తాను భావిస్తున్నట్లు పేర్కొంది. అందువల్ల తనకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదని వాటి గురించి ఆలోచించనను తెలిపింది. అంతేకాకుండా ఒక బంధం నుంచి బయట పడడం చాలా కష్టంతో కూడుకున్న పని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు నెట్టెంట వైరల్ గా మారాయి.