kannappa: ‘కన్నప్ప’ నుంచి మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?

టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా “కన్నప్ప”. ఇప్పుడు అందరు చూపు ఈ సినిమా పైనే ఉంది. వివిధ భాషలకు సంబంధించిన స్టార్ హీరోలు ఈ సినిమాలో భాగమవడంతో ప్రేక్షకులు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో మంచు విష్ణు ప్రధానోపాత్రలో నటిస్తున్నాడు. శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై చూపించబోతున్నాడు దర్శకుడు. దీంతో ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్ కనిపించబోతున్నారు.

అలాగే వీరితోపాటు మోహన్లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు ఇందులో కీలకపాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ దగ్గర పడుతుoడడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఇందులో భాగంగానే తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. తాము సినిమా కోసం ఎంత అధ్యయనం చేసామో ఎన్ని డిస్కషన్లు జరుపుకున్నాము తెలియజేస్తూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా మేకింగ్ వీడియోను షేర్ చేశాడు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే సినిమా కోసం మూవీ యూనిట్ ఎంతగా కష్టపడిందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ మీటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

తరవాత కథనం