Suhas : సుహాస్‌కు బంపరాఫర్.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ.. ఆ సినిమాలో మాస్ రోల్!

టాలెంట్ ఎవడు సొత్తు కాదు. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటి టాలెంట్ తో వచ్చిన యాక్టర్ సుహాస్. తన కెరీర్ మొదట్లో ఒక్క సినిమాలో అయినా ఛాన్స్ వస్తే బాగున్ను.. చిన్న క్యారెక్టర్ దొరికిన చాలు అనుకునేవాడు. అలా అతడు అనుకున్న విధంగానే సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు.

ముఖ్యంగా హీరోకి ఫ్రెండ్ గా నటించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తన అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పాపులారిటీ వచ్చిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సుహాస్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.

అద్భుతమైన యాక్టింగ్ చేసి సినిమా రేంజ్ ను మార్చేశాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది. దీంతో వరుస ఆఫర్లు అందుకున్నాడు సుహాస్. వెంట వెంటనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సహా మరెన్నో చిత్రాలు చేసి విజయాలు అందుకున్నాడు.

ప్రస్తుతం సుహాస్ లైనప్ లో చాలా సినిమాలే ఉన్నాయి. రెండు మూడు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా అతడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు కోలీవుడ్లో ఛాన్స్ కొట్టేసాడు. తమిళ హీరో సూరి నటిస్తున్న మండాడి చిత్రంలో సుహాస్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మణి మారన్ పొగలేనంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో సుహాస్ కోలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. ఇందులో అతడు పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సుహాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తరవాత కథనం