నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఒక సినిమాను మొదలుపెట్టాడు. NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ సినీప్రియుల్నీ, నందమూరి అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఈ సినిమా నుంచి మరికొన్ని అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ కిక్కిచ్చే సర్ప్రైజ్ అందించారు. ఈ సినిమాకి అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఈ టైటిల్ను ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో విజయశాంతి చేతిలో గన్ పట్టుకొని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.
అలాగే కళ్యాణ్ రామ్ మాస్ లుక్‌లో ఉండగా.. వెనుక వైపు బేడీలు చూపించి క్యూరియాసిటీ పెంచారు. ఈ సినిమాలో వీరిద్దరూ తల్లి కొడుకు పాత్రల్లో కనిపించనున్నారు. అయితే విజయశాంతి దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ వైజయంతి పాత్రలో కనిపిస్తుండడం గమనార్హం. 1990లో విజయశాంతి కర్తవ్యం సినిమాలో వైజయంతి పాత్రలో నటించింది.
మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆమె అదే పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సో హైల్ కాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా అజనీస్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.